Mohammed Siraj: ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు
ABN , Publish Date - Dec 11 , 2024 | 11:25 AM
Mohammed Siraj: ఐసీసీకి టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. ఆ పనిలోనే ఉన్నానంటూ అటు అత్యున్నత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు ఆస్ట్రేలియా టీమ్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత స్పీడ్ గన్.
Siraj vs Head: క్రికెట్ గ్రౌండ్‌లో సరదా ఘటనలే కాదు.. అప్పుడప్పుడూ వాగ్వాదాలు కూడా జరుగుతుంటాయి. ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం, స్లెడ్జింగ్ చేసుకోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. తిట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే మితిమీరి ప్రవర్తించినా, దురుసుగా వ్యవహరించినా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి తప్పించుకోలేరు. క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించిన వారిపై ఐసీసీ యాక్షన్ తీసుకోవడం కామన్. ఇదే క్రమంలో టీమిండియా పేస్ గన్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మీద చర్యలు తీసుకుంది ఐసీసీ. అయితే భారత స్పీడ్‌స్టర్ ఐసీసీ యాక్షన్‌కు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చాడు.
అక్కడికే వెళ్తున్నా..
మ్యాచ్ ఫీజులో కోత విధించిన ఐసీసీతో పాటు అటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా గట్టిగా ఇచ్చిపడేశాడు సిరాజ్. ఇప్పుడు తాను బాగానే ఉన్నానని.. ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్తున్నానని అన్నాడు. జిమ్‌కు పయనం అవుతున్నానని.. వార్‌కు సిద్ధమవుతున్నానని తెలిపాడు. అడిలైడ్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్ ఔటై వెళ్తున్న సమయంలో అతడికి సిరాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. సిరాజ్‌ను హెడ్ తిట్టడం.. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆసీస్ ఓపెనర్‌పై భారత పేసర్ ఫైర్ అవడం చర్చనీయాంశంగా మారింది. గ్రౌండ్‌లో హీటెక్కించిన ఈ ఘటనపై ఐసీసీ సీరియస్ అయింది.
ఐసీసీ జరిమానా
మైదానంలో దురుసుగా ప్రవర్తించినందుకు సిరాజ్‌కు ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించాడని నిర్ధారించిన అత్యున్నత క్రికెట్ బోర్డు.. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఆర్టికల్ 2.13ని ఉల్లంఘించినందుకు హెడ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష విధించింది. గత రెండేళ్లలో ఇది తొలి తప్పుగా వెల్లడించింది. హెడ్‌తో ఫైట్ కారణంగా ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న సిరాజ్‌కు ఐసీసీ ఫైన్‌తో పుండు మీద కారం చల్లినట్లు అయింది. దీనిపై అతడు కూల్‌గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు అంతా సవ్యంగానే ఉందన్నాడు. జిమ్‌కు వెళ్తున్నానని చెప్పాడు. తన తప్పు లేకున్నా కాంట్రవర్సీలో ఇరుక్కోవడం, ఐసీసీ ఫైన్ వేయడం నచ్చని సిరాజ్.. మరో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడని నెటిజన్స్ అంటున్నారు. జిమ్‌కు వెళ్లి మరింత కష్టపడి గ్రౌండ్‌లో ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తాననే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు.