Share News

Rohit Sharma: రోహిత్‌కు బీసీసీఐ షాక్.. సిరీస్ మధ్యలోనే..

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:10 PM

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. హిట్‌మ్యాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే పింక్ బాల్ టెస్ట్‌లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.

Rohit Sharma: రోహిత్‌కు బీసీసీఐ షాక్.. సిరీస్ మధ్యలోనే..
Rohit Sharma

IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు టఫ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నాడు. అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా.. రెండింటా అతడు తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌ల్లో భారత జట్టు పెర్ఫార్మెన్స్ పడిపోవడం, బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ విఫలమవడమే దీనికి కారణం. న్యూజిలాండ్ సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ వైట్‌వాష్ అవడం, ఇటీవల అడిలైడ్ టెస్ట్‌లోనూ ఘోర పరాజయం పాలవడంతో రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో అతడికి భారత క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. అసలే పింక్ బాల్ టెస్ట్‌లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.


బీసీసీఐ రెడ్ సిగ్నల్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మిగతా టెస్టుల్లో పక్కా ఆడతాడని అనుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమి.. పూర్తి సిరీస్‌కు దూరమవుతాడని సమాచారం. సిరీస్ మధ్యలోకి లేదా కనీసం నాలుగో టెస్ట్‌కల్లా అతడు అందుబాటులో వస్తాడని అంతా అనుకున్నారు. ఇక కంగారూలకు మూడినట్లేనని భావించారు. కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పింక్ బాల్ టెస్ట్ ముగియగానే షమి రాకపై రోహిత్ సానుకూల సంకేతాలు ఇచ్చాడు. అతడి కోసం జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నాడు. షమి వస్తే అదిరిపోతుందని చెప్పాడు. అతడి కోసం ఎదురు చూస్తున్నామన్నాడు. కానీ షమి ఆడటం అనుమానంగా మారింది.


ఫిట్‌నెస్‌పై నజర్

రెండో టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఊహించిన రీతిలో రాణించకపోవడం.. కొత్త కుర్రాడు హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం తెలిసిందే. దీంతో షమి రాకతో అంతా మారుతుందని రోహిత్‌తో పాటు అభిమానులు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే షమి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కంగారు పడుతోందని తెలుస్తోంది. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయగలడా? లేదా? అని సందేహిస్తోందట. అందుకే షమి ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోందట. అతడు ఫుల్‌గా రికవర్ అయ్యాడు.. టెస్టుల్లో ఆడగలడనే ధీమా వచ్చే వరకు ఆసీస్ ఫ్లైట్ ఎక్కించొద్దని భావిస్తోందట. అసలే రెండో టెస్టు ఓటమితో నిరాశలో ఉన్న రోహిత్ అండ్ కోకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బీసీసీఐ షాక్‌తో హిట్‌మ్యాన్‌ మరింత డిజప్పాయింట్ అయ్యాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. షమి లోటును హిట్‌మ్యాన్ ఎలా భర్తీ చేస్తాడో చూడాలి.


Also Read:

ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

కోహ్లీ కొత్త అవతారం.. ఇక కంగారూల ఖేల్ ఖతం

రోహిత్-కోహ్లీని మించిపోయిన హార్దిక్
ఫిక్సర్‌ థిల్లాన్‌పై ఆరేళ్ల నిషేధం
For More
Sports And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 12:18 PM