Virat kohli: సచిన్‌లాగే విరాట్ కోహ్లీ వెనక్కు తగ్గాల్సిందే.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 29 , 2024 | 03:00 PM
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) కలిసి ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని చాలామంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ దూకుడుగా రాణిస్తే, కోహ్లీ ఆచితూచి ఆడుతాడు కాబట్టి.. ఇద్దరిది మంచి ఓపెనింగ్ జోడీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘ఆ క్రికెటర్ అవసరమా.. అతని కంటే ఆ ఇద్దరు ప్లేయర్లే బెటర్’
కానీ.. భారత మాజీ ఓపెనర్ విరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ఓపెనర్‌గా కోహ్లీ రాకపోవడమే బెటరని.. రోహిత్‌తో పాటు యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా దిగితే బాగుంటుందని పేర్కొన్నాడు. కోహ్లీ మూడో స్థానంలో వస్తేనే ఉత్తమమని చెప్పాడు. ‘‘ఒకవేళ నేను జట్టులో ఉండుంటే, కోహ్లీని ఓపెనింగ్‌కి పంపించను. అతడ్ని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్, యశస్వీ ఓపెనర్లుగానూ.. కోహ్లీ మూడో స్థానంలోనూ బ్యాటింగ్‌కు రావాలి’’ అని క్రిక్‌బజ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో భాగంగా సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే.. మూడో స్థానంలో వచ్చే కోహ్లీ పవర్‌ప్లేని సరిగ్గా హ్యాండిల్ చేయగలడని అన్నాడు. అలా కాకుండా వికెట్ ఆలస్యంగా పడితే.. కెప్టెన్, కోచ్ సూచనలకు అనుగుణంగా కోహ్లీ ఆడాల్సి ఉంటుందని.. జట్టులో ఓ ఆటగాడిగా ఇది తప్పక చేయాల్సిందేనని చెప్పాడు.
విరాట్ కోహ్లీపై ‘స్ట్రైక్ రేట్’పై విమర్శలు.. గౌతమ్ గంభీర్ చురకలు
ఇదే సమయంలో సెహ్వాగ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రస్తావనని తీసుకొచ్చాడు. 2007 వరల్డ్‌కప్ సమయంలో సచిన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడని గుర్తు చేశాడు. నిజానికి.. మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌ని ఇష్టం లేదని, అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం అతడు నాలుగో స్థానంలో ఆడేందుకు ఒప్పుకున్నాడని పేర్కొన్నాడు. జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి, మూడో స్థానంలో ఆడమని చెప్పినప్పుడు.. కచ్ఛితంగా అలాగే చేయాల్సి ఉంటుందని సూచించాడు. ఓపెనర్లు సెట్ చేసిన ముమెంటమ్‌ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్ బ్యాటర్‌పై ఉంటుందన్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై కోహ్లీ కూడా అభ్యంతరం తెలపడని తాను అనుకుంటున్నానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
Read Latest Sports News and Telugu News