Share News

T20 World Cup: క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా.. టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఆప్ఘాన్ పూర్ పెర్ఫార్మెన్స్..

ABN , Publish Date - Jun 27 , 2024 | 07:41 AM

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.

T20 World Cup: క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా.. టీ20 వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఆప్ఘాన్ పూర్ పెర్ఫార్మెన్స్..
T20 Worlld Cup

టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘానిస్తాన్‌కు ఓపెనర్లు శుభారంభాన్నివ్వలేదు. మొదటి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయిన ఆప్ఘానిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రమే అత్యధికంగా పది పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ దాటలేదు. ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ పరుగులేమి చేయకుండానే డకౌట్ చేరారు. తొలిసారి వరల్డ్ కప్ సెమీస్‌కు చేరిన ఆప్ఘానిస్తాన్ మరో చరిత్ర సృష్టించి ఫైనల్స్‌కు చేరుతుందని అంతా అంచనా వేశారు. కానీ సౌతాఫ్రికా బౌలర్ల దాటికి కనీసం 60 పరుగులు చేయకుండానే ఆఫ్ఘానిస్తాన్ ఆలౌటైంది.

T20 WC India vs England : లెక్క సరిచేస్తారా!


క్రికెట్ చరిత్రలో తొలిసారి..

టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వంద పరుగులలోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. గతంలో ఏ జట్టు టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో వందలోపు పరుగులు చేయలేదు. పవర్ ప్లేలోనే 28 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత మరో ఆరు ఓవర్లు ఆడకుండానే 28 పరుగులకు మిగతా ఐదు వికెట్లను ఆప్ఘానిస్తాన్ కోల్పోయింది. దీంతో 56 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. సౌతాఫ్రికా ముందు 57 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘానిస్తాన్ టీ20 క్రికెట్‌లో చేసిన అత్యల్ప స్కోర్ ఇదే. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘానిస్తాన్ చేసిన 72 పరుగులే ఇప్పటివరకు ఆ జట్టు అత్యల్ప స్కోర్ కాగా.. గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చేసిన 56 పరుగులతో ఆ చెత్త రికార్డును తిరగరాసి.. మరో చెత్త రికార్డును ఆప్ఘానిస్తాన్ సొంతం చేసుకుంది.

జర్మనీలో నిఖత్‌ శిక్షణ


ఇద్దరికి మూడేసి వికెట్లు..

దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీయగా.. రబడా, నోకియా చెరో రెండు వికెట్లు తీశారు. ఆప్ఘానిస్తాన్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో అతి తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది.


ICC : రషీద్‌ఖాన్‌కు మందలింపు

Virat Kohli: ఇదీ.. విరాట్ కోహ్లీ క్రేజ్.. న్యూయార్క్‌లో లార్జర్ దాన్ లైఫ్ విగ్రహం!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jun 27 , 2024 | 07:41 AM