Share News

Virat Kohli: కోహ్లీ లేకపోవడం టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్‌కే పెద్ద దెబ్బ

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:37 AM

ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకే కాకుండా ప్రపంచ క్రికెట్ కూడా పెద్ద ఎదురుదెబ్బ అని మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. గత 15 ఏళ్లకు పైగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడని, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి అతను అర్హుడని చెప్పాడు.

Virat Kohli: కోహ్లీ లేకపోవడం టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్‌కే పెద్ద దెబ్బ

ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకే కాకుండా ప్రపంచ క్రికెట్ కూడా పెద్ద ఎదురుదెబ్బ అని మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. గత 15 ఏళ్లకు పైగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడని, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి అతను అర్హుడని చెప్పాడు. కోహ్లీకి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని అన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. పలు నివేదికల ప్రకారం సిరీస్‌లోని మరో రెండు టెస్టులకు కూడా కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉంది. సిరీస్‌లోని మిగిలిన 3 టెస్టులకు సెలెక్టర్లు త్వరలోనే భారత జట్టును ప్రకటించనున్నారు. దీంతో జట్టును ప్రకటిస్తే కానీ కోహ్లీ తర్వాతి టెస్టులు ఆడడంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.


ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ..‘విరాట్ కోహ్లీ లేకపోవడం భారత్‌కు దెబ్బ. సిరీస్‌కు దెబ్బ. కోహ్లీ లేకపోవడం ప్రపంచ క్రికెట్‌కు కూడా దెబ్బ. ఈ సిరీస్ ప్రత్యేకం కానుంది. మొదటి రెండు టెస్టులు ఆసక్తికరంగా సాగాయి. విరాట్ కోహ్లీ 15 సంవత్సరాలకుపైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అతనికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. కుటుంబంతో గడపడానికి కొంత విరామం అవసరమైతే, ఆటకు దూరంగా ఉండనివ్వండి. అందుకు నేను విరాట్ కోహ్లీకి మద్దతు ఇస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కోహ్లీ లేకపోవడంతో అండర్సన్ వర్సెస్ కోహ్లీ పోటీని మనం చూసే అవకాశం లేదు. అయితే కోహ్లీ అతని వ్యక్తిగత జీవితానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ మ్యాచ్ ఆడినా, గేమ్ ఆడిన గొప్ప బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఏ జట్టుకైన విరాట్ కోహ్లీ లేకపోవడం లోటే అవుతుంది. కోహ్లీ లేకపోవడం టీమిండియా పెద్ద దెబ్బే. అయితే కోహ్లీ లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. కొంతకాలంగా అద్భుతంగా ఆడుతున్న కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే అతను తర్వాతి టెస్టుకు జట్టులో చేరతాడని నేను ఆశిస్తున్నాను.’’ అని అన్నాడు. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. కానీ వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు రాహుల్ దూరం కావడంతో రజత్ పటీదార్ ఆడాడు. కానీ అతను రాణించలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 09 , 2024 | 11:37 AM