Share News

Kale Yadayah: బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:46 AM

ఎమ్మెల్యేలు చేజారకుండా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నా.. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి షాకిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం కాంగ్రె్‌సలో చేరారు.

Kale Yadayah: బీఆర్‌ఎ్‌సకు మరో షాక్‌!

కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

న్యూఢిల్లీ/(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఎమ్మెల్యేలు చేజారకుండా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నా.. మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి షాకిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం కాంగ్రె్‌సలో చేరారు. ఢిల్లీలో.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో యాదయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ప్రభుత్వ సుస్థిరతకు ఎమ్మెల్యేల చేరికలు అవసరమంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించి 24 గంటలు గడవక ముందే యాదయ్య చేరిక చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఎమ్మెల్యే యాదయ్య చేరిక విషయాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం చివరి దాకా గోప్యంగా ఉంచింది. యాదయ్య పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నా ఆయన ఖండిస్తూ వచ్చారు.


కానీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, నగర శివారు ఎమ్మెల్యేలతో ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్వహించిన భేటీకి యాదయ్య దూరంగా ఉన్నారు. అయితే ఆ రోజు వికారాబాద్‌లో జిల్లా పరిషత్‌ భవన సముదాయం ప్రారంభానికి హాజరైనందున వెళ్లలేదని ఆయన చెప్పారు. ఈ ప్రారంభోత్సవ సభలో యాదయ్య మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో నిధుల విషయంలో స్వల్పంగా ఘర్ణణ కూడా పడ్డారు. దీంతో యాదయ్య పార్టీ మార్పు ప్రచారంపై ఎవరికీ అనుమానం కూడా రాలేదు. కానీ, మూడు రోజుల్లోనే ఆయన హస్తం గూటికి చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. యాదయ్య చేరిక సమయంలో ఆయన వెంట మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కూడా ఉన్నారు. కాలె యాదయ్య తొలిసారిగా 2014లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత ఆయన బీఆర్‌ఎ్‌సలో చేరారు. 2019, 2023 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాఽధించారు. మళ్లీ దాదాపు దశాబ్ద కాలం తరువాత తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.


యాదయ్య బాటలో మరికొందరు?

కాలె యాదయ్య కారు దిగడంతో ఇప్పటివరకు బీఆర్‌ఎ్‌సను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన గెలిచిన దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఇదివరకే కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. కాగా, ఉమ్మడి రంగారెడి జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు అత్యధికంగా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరిపై కూడా అధికార కాంగ్రెస్‌ కన్నేసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారు. శివారులోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ క్షణంలోనైనా తమ పార్టీలో చేరవచ్చని పేర్కొన్నాయి.

Updated Date - Jun 29 , 2024 | 04:46 AM