CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్
ABN , Publish Date - May 01 , 2024 | 11:44 AM
Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రస్తుత పాలనపై బీజేపీ అవాకులు చవాకులు పేలుతుండగా.. కేంద్రంలో బీజేపీ పాలనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బీజేపీని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది.
హైదరాబాద్, మే 1: పార్లమెంట్ ఎన్నికల (Loksabha Elections 2024) ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రస్తుత పాలనపై బీజేపీ అవాకులు చవాకులు పేలుతుండగా.. కేంద్రంలో బీజేపీ పాలనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బీజేపీని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ తప్ప అంటూ సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడింది బీజేపీనే అంటూ రేవంత్ విరుచుకుపడ్డారు. ‘‘గాడిద గుడ్డు’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..
రేవంత్ ట్వీట్ ఇదే...
తెలంగాణ అడిగింది…
పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా
బీజేపీ ఇచ్చింది…
“గాడిద గుడ్డు”
తెలంగాణ అడిగింది…
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.
బీజేపీ ఇచ్చింది…
“గాడిద గుడ్డు”
తెలంగాణ అడిగింది…
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ
బీజేపీ ఇచ్చింది…
“గాడిద గుడ్డు”
తెలంగాణ అడిగింది…
కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం
బీజేపీ ఇచ్చింది…
“గాడిద గుడ్డు”
తెలంగాణ అడిగింది…
మేడారం జాతరకు జాతీయహోదా
బీజేపీ ఇచ్చింది…
“గాడిద గుడ్డు”
తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు…
పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు” అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Politics: జయరాం నాయుడు అరెస్ట్.. టీడీపీ నేతల ఆందోళన.. రణరంగంగా అనంత
Hyderabad: బాలాపూర్లో సీఎం సభ గ్రాండ్ సక్సెస్
Read Latest Telangana News And Telugu News