Congress: కాంగ్రె్‌సలోనే గద్వాల ఎమ్మెల్యే: మంత్రి జూపల్లి
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:26 AM
‘గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి బుజ్జగింపు
గద్వాల న్యూటౌన్, ఆగస్టు 1: ‘‘గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా కొన్ని ప్రధాన పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు. అసెంబ్లీ లాబీల్లో పరిచయం ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడినంత మాత్రాన ఆయన కాంగ్రె్‌సను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కాదు’’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి గురువారం ఉదయం మంత్రి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి వెళ్లి ఆయనను బుజ్జగించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి జూపల్లి మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలోని పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేకు జ్వరం ఉన్నందున రెండు రోజులు ఫోన్లో అందుబాటులో లేరని, దీంతో పార్టీ మారారనే అనుమానాలకు తావులేదన్నారు. అనంతరం మంత్రి జూపల్లి తన కారులోనే కృష్ణమోహన్‌రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.