Share News

Dussehra Festival: దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా!

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:38 AM

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,

Dussehra Festival: దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా!

  • ప్రజలకు గవర్నర్‌, సీఎం, మంత్రుల దసరా శుభాకాంక్షలు

  • తెలంగాణకు నిత్య విజయాలు కలగాలి : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

  • రాష్ట్ర ప్రజలకు దుర్గామాత అనుగ్రహం ఉండాలి : గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది.. దసరా సరదాలకు ఊరూవాడ సిద్ధమయ్యాయి. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచే దసరా పండుగ సందర్భంగా రాష్ట్రానికి నిత్య విజయాలు కలగాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.


జగన్మాత దయతో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దసరా వేడుకల కోసం సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళుతున్నారు. ప్రతీ ఏటా స్వగ్రామంలో దసరా వేడుకలు జరుపుకోవడం ఆయనకు అలవాటు. అయితే, ఈసారి ముఖ్యమంత్రి హోదాలో సొంతూరికి వెళ్లి పండుగ చేసుకోబోతున్నారు. ఇక, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో సీఎం ఆదివారం పర్యటిస్తారు.

Updated Date - Oct 12 , 2024 | 03:38 AM