Live..: 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ABN, Publish Date - Aug 02 , 2024 | 10:35 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9వ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సభాపతి రద్దు చేశారు. పలు శాఖల నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సభలో జాబ్ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) 9వ రోజు (9th Day) శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సభాపతి రద్దు చేశారు. పలు శాఖల నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సభలో జాబ్ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా... దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతియేటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించేలా ఒక విధానం తీసుకురావాలని క్యాబినేట్ నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీచేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు.
అలాగే జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధతపై సభలో చర్చ జరగనుంది. ధరణిపై కూడా షార్ట్ డిస్కషన్ జరుగనుంది. గత 8 రోజులుగా సభ వాడీ వేడిగా సాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. రోజుకో రచ్చ.. రసవత్తరంగా చర్చ జరుగుతోంది. కాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరుల సమస్యలపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా ఈరోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.
కాగా నిన్న సభలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్‌దైతే.. సోనియాగాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం దళిత బిడ్డను అధ్యక్షా అని సంబోధించడం ఇష్టం లేకే కేసీఆర్ సభకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డ అయిన స్పీకర్ ఉన్నత స్థానంలో కూర్చుంటే ఆయన కింద కూర్చోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే సభకు రావడం లేదని ఆరోపించారు. దళితుల్ని మోసం చేసిన కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలంటే... అధ్యక్షా మైక్ ఇవ్వండంటూ అడ్డుక్కునే పరిస్థితికి తీసుకువచ్చామని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిజిస్ట్రేషన్ శాఖలో జగన్ అక్రమాలు ..
మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 02 , 2024 | 10:35 AM