TS News: టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. ఉద్రిక్తం
ABN , Publish Date - Jul 02 , 2024 | 01:16 PM
Telangana: టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించేందుకు ఏబీవీపీ యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వెంటనే బాజ్ క్యాలండర్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.
హైదరాబాద్, జూలై 2: టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని (TSPSC Office) ఏబీవీపీ విద్యార్థులు (ABVP Students) ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించేందుకు ఏబీవీపీ యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే గ్రూప్ 2 పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు.
CM Chandrababu: ఇవాళ మూడు శాఖల పని తీరుపై చంద్రబాబు సమీక్ష
తక్షణమే మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఏబీవీపీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి....
Lok Sabha Updates: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. మోదీపై అఖిలేష్ సెటైర్లు..
Harish Rao: చంద్రబాబు అత్యంత శక్తివంతుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చేతిలోనే..
Read Latest Telangana News AND Telugu News