Kaleswaram projecT: కాళేశ్వరం అవకతవకలపై విచారణలో కమిషన్ దూకుడు
ABN , Publish Date - Oct 24 , 2024 | 09:47 PM
ళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది. కమిటీకి ఈ ప్రాజెక్ట్‌పై పలు ఫిర్యాదులు అందడంతో విచారణను ముమ్మరం చేసింది, విచారణకు సంబంధించిన పలు విషయాలను ఇవాళ (గురువారం) మీడియాకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై మాజీ ENC నల్లా వెంకటేశ్వర్లు విచారణ ఇవాళ(గురువారం) ముగిసింది . రేపు(శుక్రవారం) మరోసారి విచారణకు హాజరు కావాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆదేశించారు. వెంకటేశ్వర్లను రెండు విడతలుగా కమిషన్ చీఫ్ విచారించారు. రేపు మళ్లీ విచారణకు రావాలని వెంకటేశ్వర్లను ఆదేశించారు. బహిరంగ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పలుమార్లు వెంకటేశ్వర్లు ప్రస్తావించారు. టెక్నికల్ అంశాల తర్వాత డీపీఆర్ ఎవరు అప్రూవల్ చేశారని వెంకటేశ్వర్లను ప్రశ్నించారు. డీపీఆర్ అప్రూవల్ మాజీ ముఖ్యమంత్రి చేశారని కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ చెప్పారు.
డీపీఆర్‌లు వేర్వేరుగా చేశారా ఓకే డీపీఆర్ ఉందా అని ప్రశ్నించారు. మూడు బ్యారేజీలకు వేర్వేరుగా ఒకసారి మొత్తం కలిపి మరొకసారి రెండు డీపీఆర్లు ఉన్నాయని ఈఎన్సీ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కింద కోల్బెడ్ టెస్టులు నిర్వహించారా !....కోల్బెడ్ ఆనవాళ్లు గుర్తించినట్లు రిపోర్టులు ఉన్నాయా అని కమిషన్ చీఫ్ అడిగారు. బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు.
ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నీళ్లను నిలువ చేసినట్లు కమిషన్ చీఫ్ ముందు మాజీ ENC వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రతిరోజు రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు 40 వేల కోట్ల వరకు ఉండే ఖర్చు 3 టీఎంసీలు అయ్యేసరికి డబుల్ ఎలా అయిందని నిలదీశారు. కేవలం అదనంగా 2 లక్షల ఎకరాల కోసం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా అని ప్రశ్నించారు. ప్రాణహిత - చేవెళ్ల వద్ద రెండు లిఫ్టులు ఉన్నాయని.. తక్కువ విద్యుత్తు ఖర్చు అవుతుందని.. మరి కాలేశ్వరం మూడు లిఫ్టులను ఎక్కువ విద్యుత్ ఖర్చులు ఎందుకు చేశారని కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నార్మల్ ప్రాజెక్టు కాదని.. ఇది ప్రత్యేకమైన గ్యారేజీ అని మాజీ ENC వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
KTR : కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది
Jagdish Reddy: రైతులను మోసగిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం
TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా
Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..
Read Latest Telangana News And Telugu News