Share News

Devi Prasad: బీఆర్ఎస్ పాలనలో పోలీసు శాఖలో సంస్కరణలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:52 PM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాటలను పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ నేత జి .దేవిప్రసాద్ తెలిపారు. పోలీసు అధికారుల పట్ల బీఆర్ఎస్‎కు గౌరవం ఉందని అన్నారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్‎లో దేవిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.

 Devi Prasad: బీఆర్ఎస్ పాలనలో పోలీసు శాఖలో   సంస్కరణలు
Devi Prasad

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాటలను పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ నేత జి .దేవిప్రసాద్ తెలిపారు. పోలీసు అధికారుల పట్ల బీఆర్ఎస్‎కు గౌరవం ఉందని అన్నారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్‎లో దేవిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా దేవిప్రసాద్ మాట్లాడుతూ... పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చిందని హరీష్ రావు అన్నారని గుర్తుచేశారు.


ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో నలుగురు మాజీమంత్రులు పర్యటిస్తే దాడులు జరిగాయని చెప్పారు. కనీసం పోలీసులు ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పోలీసు శాఖలో చాలా సంస్కరణలను మాజీ సీఎం కేసీఆర్ చేశారని గుర్తుచేశారు.


47 వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ నియామకం బీఆర్ఎస్ హయాంలో జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతిభద్రతల వైఫల్యం చెందాయని.. ఇది ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నామని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటి రెండు మినహా ఎన్ కౌంటర్లు జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్‎కౌంటర్లు ప్రారంభం అయ్యాయని .దేవిప్రసాద్ తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 05:52 PM