Share News

Harish Rao: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:33 PM

పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.

Harish Rao: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Harish Rao

సిద్దిపేట జిల్లా: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఈరోజు(సోమవారం) చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీష్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు.


ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటామని... కానీ సాగునీరు జీవన ఆధారమని తెలిపారు. జీవన గతిని, పల్లెల ముఖ చిత్రాన్ని మార్చేది సాగునీరు మాత్రమేనని అన్నారు. అభివృద్ధి అక్కడితో ఆగదని, ఎంత చేసుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుందని.. ఇంకా పనులు మిగిలే ఉంటాయని చెప్పారు. పదవుల్లో ఉన్నపుడు ఎన్ని మంచి పనులు చేశామనేదే శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. మళ్లీ ఇంకా మంచి అవకాశాలు రావాలని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తన సహకారం ఎప్పటికి ఉంటుందని హరీశ్‌‌రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి....

AADI SRINIVAS: కేసీఆర్ తప్పు చేసి హైకోర్టు మెట్లు ఎక్కాడు

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 05:43 PM