Share News

KTR: కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:20 PM

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ‌ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు.

KTR: కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కరీంనగర్: ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ‌ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టు అని అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నా డ్యాంల పరిశీలన చేస్తున్నామని వివరించారు.

రైతులు ఆందోళన చెందితే ఇంకా ఎందుకు పంపింగ్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కన్నెపల్లి వద్ద పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నీటితో నింపవచ్చని అన్నారు. మేడిగడ్డ కొట్టుకు పోతుందని చేసిన ప్రచారం వట్టిదేనని తేల్చిచెప్పారు. శాసనసభ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. రేపు కన్నెపల్లి, మేడిగడ్డ బారేజిని‌ సందర్శిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.


రేపు మేడిగడ్డ , కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శన

కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) సందర్శించేందుకు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వారు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. కాసేపటి క్రితమే ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. కాళేశ్వరం చేరుకుని మొదటగా LMD రిజర్వాయర్ సందర్శించారు. అనంతరం గురువారం రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ నేతల బృందం బస చేయనున్నారు. శుక్రవారం (రేపు) 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్, 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీ‌లను వారు సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

KTR--4.jpg


కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలోనూ బృందం పర్యటనకు వెళ్లనుండటంతో రాజకీయంగా ఆసక్తి వాతావరణం నెలకొంది.


బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం

మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందిని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీటిని రైతులకు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. BRS నాయకులు తమ జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారని తెలిపారు. 2టీఎంసీల నీటి కోసం తీసుకున్న ప్రణాళిక ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు కాలేదని ప్రశ్నించారు. ఈరోజు(గురువారం) సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రెండు టీఎంసీల నీరు రాలేదు కానీ రూ. 2 వేల కోట్లతో మూడో టీఎంసీ నీటి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Updated Date - Jul 25 , 2024 | 07:25 PM