Share News

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:52 PM

అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని... గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందని ఈ క్రమంలో కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే చెప్పడం అవివేకమని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం రేవంత్ రెడ్డి విచారణ కోరారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.


వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని, కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడి తప్పు అని.. కానీ గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన అని, ఆయన తన ప్రజలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు.

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందని కిషన్ రెడ్డి అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో బొగ్గు శాఖ, గనుల శాఖ విడివిడిగా పెవిలియన్లు ఏర్పాటు చేశామన్నారు. కోల్ ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారని, ఇది ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. బొగ్గు వెలికితీత ముగిసిన తర్వాత ఆ గనులను పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడేలా ఎలా తీర్చిదిద్దాలి అన్న విషయంపై పనిచేస్తున్నామని చెప్పారు. బొగ్గు పరిశ్రమలో ప్రమాదాలు లేకుండా కార్మికుల క్షేమమే ప్రధాన ఎజెండాగా కార్యక్రమాలు రూపొందించామన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు కోల్ ఇండియా ఫౌండేషన్ డే ఉత్సవాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


గనుల శాఖకు సంబంధించి:

దేశ అవసరాలకు 95 శాతం రాగి దిగుమతులు చేసుకుంటున్నామని, నిత్యజీవితంలో కాపర్ వినియోగం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. కాపర్ సహా అనేక ఖనిజాలు, ధాతువులు, క్రిటికల్ మినరల్స్ విషయంలో ఆత్మనిర్భర్, స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. క్రిటికల్ మినరల్స్‌లో లిథియం ఒకటని.. దాన్ని వెలికితీయడం కష్టతరమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాబిల్ సంస్థను ఏర్పాటు చేశామని, ఇది వివిధ దేశాలు సందర్శించి లిథియం నిక్షేపాల వెలికితీత గురించి తెలుసుకుంటుందన్నారు. సముద్రగర్భంలో ఉన్న ఖనిజాల వెలికితీత గురించి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, లిథియం విషయంలో ఆస్ట్రేలియా, అమెరికా, అరబ్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్

అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట

నాకు అంత స్ధాయిలేదు లోకేష్‌ అన్నా..: శ్రీరెడ్డి

వైసీపీ సర్పంచ్ హుసేని ఇద్దరు కార్యకర్తల అరెస్టు..

అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 14 , 2024 | 01:52 PM