Share News

Lasya Nanditha: అశ్రునయనాలతో లాస్య నందితకు వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు..

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:13 PM

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు. ఇంటి నుంచి సాగిన అంతిమయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాడె మోశారు.

Lasya Nanditha: అశ్రునయనాలతో లాస్య నందితకు వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు..

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. బోయన్‌పల్లిలోని ఇంటి నుంచి మారేడుపల్లిలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని లాస్యకు తుది వీడ్కోలు పలికారు. ఇంటి నుంచి సాగిన అంతిమయాత్రలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాడె మోశారు. ఆమె తండ్రి సాయన్న(Sayanna) అంత్య క్రియలు జరిగిన శ్మశాన వాటికలోనే లాస్య అంత్యక్రియలు కూడా జరిగాయి. ప్రమాదం జరిగిన దగ్గరి నుంచి హరీశ్ రావు లాస్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా.. లాస్య భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

కాగా.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) శుక్రవారం మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌ (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి, ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే లాస్య నందిత బయటపడ్డారు.

Updated Date - Feb 23 , 2024 | 08:21 PM