Share News

TG Ministers: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం.. మంత్రుల ఫైర్

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:22 PM

కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు.

TG Ministers: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం.. మంత్రుల ఫైర్

కరీంనగర్: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు తేలేక పోయారని మండిపడ్డారు. వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఈరోజు(శుక్రవారం) కరీంనగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.


ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ను వారే కూల్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ధనిక తెలంగాణను గత సర్కార్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాప్, ఇరిగేషన్, కరెంట్‌తో అరాచకాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ALSO Read: KTR: చారాణ కోడికి..! బారాణ మసాలా అంటూ రేవంత్‌కి కౌంటర్

రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తాం: మంత్రి ఉత్తమ్

uttam-kumar-minister.jpg

రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. రైతులను ఆందోళనకు గురిచేసేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ నిర్దారణకు మాత్రమే రేషన్ కార్డు ప్రమాణికమని తెలిపారు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు పేరుతో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని అన్నారు.


కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. ఒకదానితో ఒకటి లింక్ పెట్టబోమని అన్నారు. కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తాము రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు.కేసీఆర్ చేసింది పదేళల్లో 25 వేల కోట్ల రుణమాఫీ మాత్రమేనని అన్నారు.


ALSO Read: Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమిదే.. : మంత్రి తుమ్మల

Thummala-Nageswara-Rao.jpg

పెద్దపల్లి: గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. గిట్టుబాటు ధర కూడా కల్పించలేదని మండిపడ్డారు. రైతులు కాలర్ ఎగరేసుకున్న రోజు రావాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ఈరోజు(శుక్రవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లిలో పర్యటించారు.


ఈ సందర్భంగా మీడియాతో తుమ్మల మాట్లాడుతూ... ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొ్న్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు

Raj Tarun-Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. లవ్ ప్రపోజ్ చేసిన..

Read More Telangana News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 03:52 PM