Share News

Minister Thummala: గోల్డ్‌ పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న రైతులకు రుణమాఫీ

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:20 PM

బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న వారికి పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు.

Minister Thummala: గోల్డ్‌ పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న రైతులకు రుణమాఫీ
Minister Thummala Nageswara Rao

హైదరాబాద్: బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న వారికి పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఇవ్వమని స్పష్టం చేశారు. వ్యవసాయం చేసే గ్రూప్ - 4 ఉద్యోగులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 11.50 లక్షల మందికి రూ.లక్షవరకు బకాయిలు ఉన్నాయని వివరించారు. వీరి కోసం ఎల్లుండి రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీని ఎల్లుండి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి చేస్తారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


ALSO Read: CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

12 లక్షల మంది రైతులకు లక్ష రుణమాఫీ

ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం పూర్తి అవుతుందని అన్నారు. రైతులకు తెల్ల రేషన్ కార్డ్ అనేది నిర్ధారణ కోసం మాత్రమేనని చెప్పారు. అన్ని బ్యాంకుల వివరాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని రైతుల దగ్గరకు నేరుగా తమ డిపార్ట్మెంట్ అధికారులు వెళ్లి పరిశీలిస్తారని చెప్పారు. 18 తేదీన 12 లక్షల మంది రైతులకు లక్ష రుణమాఫీ ఉంటుందని వివరించారు. లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ కాదని చెప్పారు. ఇలాంటి వారివి 17వేల అకౌంట్స్ ఉన్నాయని, మొత్తం రాష్ట్రంలో 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయని తెలిపారు. నకిలీ పట్టా పాసు బుక్‌లు పెట్టి రుణాలు తీసుకున్న వారిని ఐడెంటిఫై చేశామన్నారు 18 తేదీన దాదాపు రూ.6 వేల కోట్లు రైతుల ఖాతాలోకి వెళ్తున్నాయని అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి

Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 09:28 PM