Share News

Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..

ABN , Publish Date - Aug 31 , 2024 | 10:35 AM

బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం సృష్టించింది. కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్‌లో ఉన్న కార్లు, ఆటోను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో డ్రైవర్‌తోపాటు ఓ కుటుంబానికి చెందిన నలుగురు కారులో ఉన్నారు. అయితే వారంతా స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం సృష్టించింది. కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్‌లో ఉన్న కార్లు, ఆటోను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో డ్రైవర్‌తోపాటు ఓ కుటుంబానికి చెందిన నలుగురు కారులో ఉన్నారు. అయితే వారంతా స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ఓ కాంప్లెక్స్ ఎదుట కొన్ని కార్లు, ఓ ఆటో పార్క్ చేసి ఉన్నాయి. అయితే అతివేగంగా వచ్చిన ఓ కారు వాటిని ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఆ సమయంలో కారులో భార్యభర్తలు తమ ఇద్దరి పిల్లలతో ప్రయాణిస్తున్నారు. వీరంతా శంషాబాద్ నుంచి బంజారాహిల్స్ మీదుగా చిలకలగూడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌లో కుటుంబసభ్యులకు స్వల్పగాయాలు కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బాధితుణ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్ మైనర్‌గా తెలుస్తోంది. ప్రమాదంలో కార్లు, ఆటో నుజ్జునుజ్జు అయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అధిక వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Aug 31 , 2024 | 10:35 AM