TG Politics: తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..
ABN , Publish Date - Sep 16 , 2024 | 02:08 PM
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. 10కిపైగా సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పాలనపై..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్ధాలుగా పైగా కాంగ్రెస్ పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. పదవులను ఆశించకుండా అధిష్టానం తనకు అప్పగించిన పనిని చేసుకుని వెళ్లడమే ఆయనకు తెలుసు. తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువుగా ఉండటం.. ఈ మధ్య కాలంలో బీసీ నినాదం ఎక్కువ వినిపిస్తుండటంతో.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవి దక్కింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉండటంతో.. బీసీకి పీసీసీ పదవి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడంతో మహేశ్ కుమార్‌గౌడ్‌ను అదృష్టం వరించింది.
మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గత విబేధాలను పక్కనపెట్టి నాయకులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై ఉంది. దీనికి తోడు త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కొత్త పీసీసీ చీఫ్‌కు సవాలుగా చెప్పుకోవచ్చు. ఓవైపు అద్భుతమైన పాలన అందిస్తున్నామని.. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. ఈ క్రమంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెప్పుకోవచ్చు.
Ration Mafia: తిరువూరులో రెచ్చిపోతున్న రేషన్ బియ్యం మాఫియా..
అతిపెద్ద సవాల్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని.. విమర్శలు మొదలుపెట్టింది. ఓవైపు అన్ని హామీలు అమలుచేస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే.. అంతా మాయ అంటూ బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రెండు పార్టీల మధ్య పంచాయితీ పక్కన పెడితే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. మరో రెండు నుంచి మూడు నెలలలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుగా చూడాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. 10కిపైగా సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కూడా కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా లేరనే ప్రచారం జరిగింది.
Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
బీఆర్‌ఎస్ మాటల దాడి..
ప్రతిరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ దశలో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. బాధ్యతలు కొత్తగా స్వీకరించినా.. ఎన్నికల్లో ఫలితాలకు పీసీసీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించి మహేశ్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here