Share News

Big Breaking: గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా?

ABN , Publish Date - Jul 06 , 2024 | 01:52 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయనున్నారా? అంటే.. అధికార వర్గాల నుంచి అవుననే సమాచారం వస్తోంది. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, ఈ పరీక్షలను వాయిదా వేయాలని..

Big Breaking: గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా?
Telangana Group 2 Exams

హైదరాబాద్, జులై 06: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయనున్నారా? అంటే.. అధికార వర్గాల నుంచి అవుననే సమాచారం వస్తోంది. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, ఈ పరీక్షలను వాయిదా వేయాలని.. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై శుక్రవారం నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలను వాయిదా వేయాలని.. పోస్టుల సంఖ్యను పెంచాలంటూ నిరసన, నిరాహార దీక్షలు సైతం చేస్తున్నారు విద్యార్థులు.

Also Read: బీఆర్ఎస్‌కు షాక్‌.. ఆ ఎమ్మెల్యే కూడా జంప్..


విద్యార్థుల్లో ఆగ్రహం పెరిగిపోతుండటంతో నష్ట నివారణ చర్యలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ - 2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జులై 17వ తేదీ నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల వినతి మేరకు పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఇవాళో, రేపో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.


డీఎస్సీ వాయిదా లేనట్లేనా?

అయితే, ఉద్యోగార్థులు డీఎస్సీ పరీక్షను సైతం వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీని ప్రకటించాలన్నారు. డీఎస్సీ పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగార్థులు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 06 , 2024 | 01:52 PM