Share News

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

ABN , Publish Date - Jun 17 , 2024 | 02:50 PM

ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.

TGNAB: విద్యార్థుల బ్యాగులు 100శాతం తనిఖీ చేయాల్సిందే: టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్

హైదరాబాద్: ఇటీవల డ్రగ్స్ తీసుకున్న మహిళలో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) తెలిపారు. కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో మత్తుపదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో యాజమాన్యాలకు టీజీ న్యాబ్ డైరెర్టర్ సందీప్ శాండిల్య పలు సూచనలు చేశారు.


పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు కీలక సూచనలు..

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు యాజమాన్యాలు సహకరించాలని సందీప్ శాండిల్య కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల స్కూల్ బ్యాగులను 100శాతం తనిఖీ చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. బ్యాగుల్లో ఈ-సిగరెట్స్, గంజాయి, లిక్కర్ బాటిళ్లు ఉంటున్నాయని, అందుకే తప్పని సరిగా రోజూ వారి బ్యాగులు తనిఖీ చేయాలన్నారు.

విద్యాసంస్థల్లో కొంతమంది సీనియర్లు జూనియర్లను డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. యాంటి డ్రగ్ కమిటీలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు ఒక రిటైర్డ్ పోలీస్‌ను రిక్రూట్ చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

Harish Rao: వ్యూస్ కోసం నా క్రెడిబులిటీ దెబ్బతీస్తారా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..

Updated Date - Jun 17 , 2024 | 02:50 PM