Share News

Thummala: ధనిక రాష్ట్రాన్ని దోచుకున్నారు.. మంత్రి తుమ్మల సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Nov 27 , 2024 | 07:44 PM

కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో కూడా దోచుకుందని విమర్శించారు.

Thummala: ధనిక రాష్ట్రాన్ని దోచుకున్నారు.. మంత్రి తుమ్మల సంచలన ఆరోపణలు

హైదరాబాద్: ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కొందుర్గ్ మండల కేంద్రానికి మరో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) గాంధీభవన్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... తెలంగాణ రైతుల తాము పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో రూ.2 వేల కోట్లతో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. 30వ తేదీన మహబూబ్ నగర్‌లో జరిగే రైతు పండుగలో పెండింగ్ ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేశ విదేశాల్లో తెలంగాణ బియ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో కూడా దోచుకుందని విమర్శించారు. మహబూబ్ నగర్ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తప్పకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్‌కి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సమస్యలను రేవంత్ ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్‌లో జరిగే రైతుల సదస్సుకు రైతులు భారీగా హాజరు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.


మహబూబ్‌నగర్‌లో భారీ ఎత్తున వ్యవసాయ ప్రదర్శన

‘‘రాష్ట్రంలో ఈ ఏడాది పాటు చాలా వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు 30వ తేదీన మహబూబ్‌గర్‌లో జరిగే రైతు సదస్సులో వివరిస్తాం. రేపు మహబూబ్‌నగర్‌లో భారీ ఎత్తున వ్యవసాయ ప్రదర్శన ఉంది. అలాగే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాను. జిల్లాల వారీగా ఆయా ఇన్‌చార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాలను తీసుకోవాల్సి ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహబూబ్‌గర్ రైతు సదస్సు పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

Updated Date - Nov 27 , 2024 | 07:44 PM