Share News

KIshan REddy: కేసీఆర్‌లాగే జగన్‌కు ఓటమి

ABN , Publish Date - May 21 , 2024 | 03:26 AM

తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించినట్లే, ఏపీలో జగన్‌ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్‌ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్‌ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్‌ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.

KIshan REddy: కేసీఆర్‌లాగే జగన్‌కు ఓటమి

  • అహంకారానికి గుణపాఠం తప్పదు

  • ఏపీలో కూటమిదే అధికారం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మే 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించినట్లే, ఏపీలో జగన్‌ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్‌ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్‌ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్‌ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు. ఏపీలో కూటమిదే అధికారమని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్‌ చేశారు. ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ విజయం ఖాయమని అన్నారు.


బీఆర్‌ఎస్‌ ప్రభావం ఎక్కడా లేదని, కాంగ్రెస్‌ అభ్యర్థికి క్యాడర్‌ సహకరించడం లేదని కిషన్‌రెడ్డి వివరించారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే ఎమ్మెల్సీ ఎన్నిక రావడం తమకు కలిసివచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రూ.13 వేల కోట్ల అప్పులు చేసిందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఆయన ఢిల్లీలో నిర్మలతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాలు పొందగా, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి భారీగా రుణాలు పొందటానికి ప్రయత్నం చేస్తోందని తెలిపారు.


కాంగ్రెస్‌ నేతలది పూటకో మాట: కొండా

మద్యం కుంభ కోణంలో కాంగ్రెస్‌ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసిన ఆ పార్టీ నేతలు.. కేజ్రీవాల్‌కు ఎలా మద్దతు పలుకుతారని ప్రశ్నించారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ వద్ద కొండా మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశంపై తెలంగాణలో కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేసిందని.. కానీ, రాయ్‌బరేలీ, అమేథీలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లు అమలు కావడం లేదని విమర్శించారు.

Updated Date - May 21 , 2024 | 03:26 AM