Share News

Hyderabad: త్యాగం రాహుల్‌ వారసత్వం..

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:22 AM

‘‘అన్ని రకాల అసమానతలతో పోరాడటం ఆయన వ్యక్తిత్వం... వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం... త్యాగం ఆయన వారసత్వం... పోరాటం ఆయన తత్వం... రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు.. రాహుల్‌గాంధీ’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Hyderabad: త్యాగం రాహుల్‌ వారసత్వం..

  • గాంధీభవన్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు

  • యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  • పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ‘‘అన్ని రకాల అసమానతలతో పోరాడటం ఆయన వ్యక్తిత్వం... వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం... త్యాగం ఆయన వారసత్వం... పోరాటం ఆయన తత్వం... రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు.. రాహుల్‌గాంధీ’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ‘ఎక్స్‌’లో ఈమేరకు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ శిబిరంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి రక్తదానం చేశారు. వారితో పాటు 300 మందికిపైగా తమ రక్తాన్ని దానం చేశారని శివసేనారెడ్డి వెల్లడించారు. రాహుల్‌ జన్మదినం సందర్భంగా ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు కేక్‌ను కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.


తెలంగాణ భవన్‌లో

రాహుల్‌ జన్మదిన వేడుకలు

న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి రాహుల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పొన్నం ప్రభాకర్‌, వీహెచ్‌, మధుయాష్కీ, వంశీచంద్‌రెడి,్డ సంపత్‌కుమార్‌ తదితరులు రాహుల్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 20 , 2024 | 03:22 AM