TG Politics: ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆయన జైలుకు పోవడం ఖాయం.. షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Apr 13 , 2024 | 10:00 PM
లోక్‌సభ ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జైలుకు పోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
కామారెడ్డి జిల్లా: లోక్‌సభ ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జైలుకు పోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తోపాటు మరికొన్ని స్కామ్‌లతో పాటు భూ కంభకోణాలు కూడా బయటపడుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లలో బీఆర్ఎస్ నేతలు భార్యాభర్తల మాటలు వినడం సిగ్గుచేటన్నారు.
Venkatram Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పోలీస్ ఉన్నత అధికారుల పర్యవేక్షణలో వారి వాహనాల్లో డబ్బులు తరలించడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు రైతుల పట్ల బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
Kishan Reddy: బీఆర్ఎస్కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..