Viral Video: జిమ్‌లో ఊసరవెల్లుల కసరత్తులు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 07:10 AM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. అందులోనూ మనుషులను అనుకరించే జీవులను చూసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. అందులోనూ మనుషులను అనుకరించే జీవులను చూసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో ఊసరవెల్లులు చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు ఊసరవెల్లులు జిమ్‌లోకి (Chameleons in the gym) ప్రవేశించాయి. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. అక్కడ అవి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. జిమ్‌లోని పరికరాల వద్దకు వెళ్లిన ఊసరవెల్లులు.. వాటి ఎదురుగా ఆగి పుషప్స్ తీయడం స్టార్ట్ చేశాయి.
Viral Video: ఈ ఫాస్ట్ ఫుడ్ తింటే ఏకంగా పైకేనేమో.. ఎలా చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..
ఒక దాని కంటే మరొకటి పోటాపోటాగా పుషప్స్ తీయడం (Chameleons doing pushups) మొదలెట్టాయి. ఇలా ఆ ఊసరవెల్లులు చాలా సేపు అక్కడే పుషప్స్ తీస్తూ ఉన్నాయి. అయితే తొండలు, ఊసరవెల్లులు ఇలా ప్రవర్తించడం సర్వసాధారణంగానే జరిగినా.. అవి జిమ్‌లో ఇలా చేయడం వల్ల వ్యాయామం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. చూసేందుకు అచ్చం పుషప్స్ తీస్తున్నట్లుగా ఉండడంతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషులు జిమ్ చేయడానికి బద్ధకించడంతో ఊసరవెల్లులు చేసి చూపిస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా సిన్సియర్‌గా జిమ్ చేస్తున్నాయి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 లక్షలకు పైగా లైక్‌లు, 17.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఒకే ఒక్కడు వణికించాడుగా.. రైలు పట్టాలపైకి వచ్చిన సింహం పరిస్థితి.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..