Share News

Supreme Court: స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2023-11-27T19:13:28+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు ( Skill Development Case )లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు ( Chandrababu ) బెయిల్ రద్దుపై రేపు సుప్రీంకోర్టు ( Supreme Court ) లో విచారణ జరగనున్నది. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Supreme Court: స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ

ఢిల్లీ : స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు ( Skill Development Case )లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు ( Chandrababu ) బెయిల్ రద్దుపై రేపు సుప్రీంకోర్టు ( Supreme Court ) లో విచారణ జరగనున్నది. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. గత వారం వైసీపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. రేపు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ విచారణకు రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం రేపు విచారణ చేపట్టనున్నది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో... తమ వాదనలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తాము చెప్పిన ఏ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటీషన్‌లో తెలిపారు. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిందని పిటీషనర్ తెలిపారు. సుప్రీంకోర్టు వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

Updated Date - 2023-11-27T19:13:52+05:30 IST