YVB Rajendra Prasad: కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు

ABN , First Publish Date - 2023-10-02T22:08:32+05:30 IST

కేంద్రం ఇచ్షిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మళ్లించారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్(YVB Rajendra Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు.

YVB Rajendra Prasad: కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు

కృష్ణా: కేంద్రం ఇచ్షిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దారి మళ్లించారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్(YVB Rajendra Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సోమవారం నాడు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నల్లదుస్తులు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా తమకు సంక్రమించిన విధులు, నిధులను సీఎం జగన్‌రెడ్డి లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి సర్పంచ్‌లు ఇచ్చి సమస్యను విన్నవించారు. ఈసందర్భంగా వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పట్ల వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. నిధులు, విధులు విషయంలో జగన్ మోసం చేశాడు. గ్రామాలు అభివృద్ధి దేశాభివృద్ధి అన్న గాంధీ ఆశయాలకు విరుద్ధంగా జగన్ పాలన చేస్తున్నారు’’ అని వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు.

Updated Date - 2023-10-02T22:47:56+05:30 IST