Laptop: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.54 వేల ఖరీదైన ల్యాప్‌టాప్.. కేవలం రూ.24 వేలకేనట..!

ABN , First Publish Date - 2023-06-20T15:45:44+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది హార్డ్ వర్క్‌తో కాకుండా స్మార్ట్ వర్క్‌తో దూసుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. తమ ట్యాలెంట్‌తో ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు తమ ఆర్థిక స్థోమతను బట్టి ట్యాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ని వినియోగించి తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని..

Laptop: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.54 వేల ఖరీదైన ల్యాప్‌టాప్.. కేవలం రూ.24 వేలకేనట..!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది హార్డ్ వర్క్‌తో కాకుండా స్మార్ట్ వర్క్‌తో దూసుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. తమ ట్యాలెంట్‌తో ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు తమ ఆర్థిక స్థోమతను బట్టి ట్యాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ని వినియోగించి తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వివిధ కంపెనీలు.. ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) .. రూ.54 వేల ఖరీదైన ల్యాప్‌టాప్.. కేవలం రూ.24వేలకే అంటూ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్‌తో పాటూ ల్యాప్‌టాప్‌ను వినియోగించడం సర్వసధారణమైంది. అయితే మంచి ల్యాప్‌టాప్ (Laptop) కావాలంటే కనీసం రూ.50 నుంచి రూ.60వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో అవే ల్యాప్‌టాప్‌లను సగం ధరకే అందిస్తామంటూ అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో Dell, Lenovo, HP తదితర కంపెనీల ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఏయే ల్యాప్‌టాప్‌లు ఎంతెంత ధరకు అందుబాటులో ఉన్నాయో పరిశీలిస్తే..

dell.jpg

DELL Latitude 5490 Core i5 7th Gen (16GB RAM, 512GB SSD) ల్యాప్‌టాప్ ధర రూ.54,999 కాగా.. అమెజాన్‌లో రూ.24,999 కు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో పాటూ హైడెఫినిషన్ వీడియో రిజల్యూషన్‌‌తో వస్తోంది. ఇందులో ఎంఎస్ ఆఫీస్ కూడా ఇచ్చారు కాబట్టి ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు.

Lenovo.jpg

1.5kg బరువు ఉన్న Lenovo ThinkPad X260 (8GB DDR4 RAM, 256GB స్టోరేజ్) ల్యాప్‌టాప్.. Intel Core i5 6300U ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.40,000 కాగా.. అమెజాన్‌లో రూ.16,799లకు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో వెబ్‌క్యామ్ కూడా అందుబాటులో ఉండడం వల్ల.. వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా చేయవచ్చు.

HP-Chromebook.jpg

HP Chromebook 13 G1 6th Gen Intel Core m5 FHD ల్యాప్‌టాప్.. పూర్తి HD స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో Chrome OS కూడా ఇవ్వబడింది. ఇది Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తోంది. దీని ధర రూ.89,999కాగాజ.. అమెజాన్‌లో రూ.15,999కు అందుబాటులో ఉంది. ఇది అధిక పనితీరు గల ప్రాసెసర్‌తో పాటూ లాగ్ ఫ్రీ, స్మూత్ ప్రాసెసింగ్‌ను కూడా అందిస్తుంది.

పైన తెలిపిన కంపెనీలతో పాటూ ASUS VivoBook 14 (2021) ల్యాప్‌టాప్ 14 అంగుళాల స్క్రీన్‌తో పాటూ HD స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. ఇది ఇంటెల్ పెంటియమ్ సిల్వర్ N6000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ రీడర్ కూడా ఉంది. ఈ కంపెనీతో పాటూ Acer Extensa 15 థిన్ & లైట్ ల్యాప్‌టాప్ కూడా అమెజాన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇలా వివిధ రకాల కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరకు అందిస్తున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు అమెజాన్ సైట్‌ను సందర్శించి, వాటి పూర్తి వివరాలను తెలుసుకుని ఇష్టమైన ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోండి.

Viral Video: వారెవ్వా.. తెలివంటే నీదే కదా బ్రదర్.. పాత కారులో ఒక్క చిన్న మార్పు చేసి.. ట్రెండ్‌లోకి వచ్చేలా చేశాడుగా..!

Updated Date - 2023-06-20T15:45:44+05:30 IST