Baby Elephant: పెద్ద గొయ్యిలో పడిన గున్న ఏనుగు.. జేసీబీతో అతి కష్టం మీద బయటకు తీస్తే.. మరుక్షణమే అదేం చేసిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-06-10T18:08:23+05:30 IST

కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని ప్రాణం పోయినా మర్చిపోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అలాంటి వారు కనిపించడం లేదు. పైపెచ్చు సాయం చేసిన వారికి ద్రోహం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే..

Baby Elephant: పెద్ద గొయ్యిలో పడిన గున్న ఏనుగు.. జేసీబీతో అతి కష్టం మీద బయటకు తీస్తే.. మరుక్షణమే అదేం చేసిందో మీరే చూడండి..!

కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని ప్రాణం పోయినా మర్చిపోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం అలాంటి వారు కనిపించడం లేదు. పైపెచ్చు సాయం చేసిన వారికి ద్రోహం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా నిత్యం ఎన్నో ఘటనలు మన కళ్ల ముందు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెద్ద గొయ్యిలో పడిన గున్న ఏనుగును జేసీబీతో అతి కష్టం మీద బయటికి తీస్తారు. అయితే బయటికి వచ్చిన ఏనుగు చివరకు చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఓ గున్న ఏనుగు (elephant) పెద్ద గొయ్యిలో పడి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయినా సాధ్యం కాక అలాగే ఉండిపోతుంది. అయితే ఏనుగును గమనించిన కొందరు స్థానికులు సాయం చేసేందుకు ముందుకొస్తారు. జేసీబీని తీసుకొచ్చి ఏనుగు పైకి వచ్చేందుకు సహకరిస్తారు. ఏనుగుకు ఎలాంటి గాయాలు కాకుండా ఎంతో జాగ్రత్తగా పైకి నెట్టుతూ చివరకు ఎలాగోలా బయటికి తీసుకొస్తారు. అతి కష్టం మీద బయటికి వచ్చిన ఏనుగు.. హమ్మయ్య! అనుకుంటూ కాస్త ముందుకు వెళ్తుంది.

Viral Video: నడుస్తూనే కుప్పకూలిపోయిన యజమాని.. పక్కనే ఉన్న పిల్లులు చేసిందేంటి..? కుక్క రియాక్షన్ ఏంటి..? ఈ వీడియోను చూస్తే..!

అయితే వెంటనే వెనక్కు తిరిగి జేసీబీ వైపు కృతజ్ఞతా భావంతో చూస్తుంది. వేగంగా దగ్గరికి వచ్చి జేసీబీ బకెట్‌కి ముద్దులు (Elephant kisses JCB bucket) పెడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలా కొద్ది సేపు తన తొండాన్ని అటూ ఇటూ తిప్పుతూ తన ప్రేమను వ్యక్తం చేసి, చివరగా ‘‘వెళ్లొస్తా మిత్రమా’’.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘నిజంగా ఈ ఏనుగు ఎంతో గ్రేట్’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం రెండు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిందో వింత వాహనం.. నివ్వెరపోయి చూస్తున్న జనం.. పడుకునే మంచాన్నే బైకుగా మార్చేశారుగా..!

Updated Date - 2023-06-10T18:08:23+05:30 IST