Viral: భారత్‌కు రాబోతున్న మరో పాక్ యువతి.. రెండ్రోజుల క్రితమే ఆన్‌లై‌న్‌లో జరిగిన పెళ్లి.. సీమా ఘటన మరువకముందే..!

ABN , First Publish Date - 2023-08-04T18:59:07+05:30 IST

ప్రేమ.. కులాల అంతరాలనే కాదు.. జిల్లాలు, రాష్ట్రాలే కాకుండా ఆఖరికి దేశ సరిహద్దులనే చెరిపేస్తోంది. ఇందుకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ఎక్కడెక్కడి వారో సోషల్ మీడియాలో స్నేహితులుగా మారుతున్నారు. చూస్తుండగానే ఆ స్నేహం కాస్త ప్రేమగా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలో...

Viral: భారత్‌కు రాబోతున్న మరో పాక్ యువతి.. రెండ్రోజుల క్రితమే ఆన్‌లై‌న్‌లో జరిగిన పెళ్లి.. సీమా ఘటన మరువకముందే..!

ప్రేమ.. కులాల అంతరాలనే కాదు.. జిల్లాలు, రాష్ట్రాలే కాకుండా ఆఖరికి దేశ సరిహద్దులనే చెరిపేస్తోంది. ఇందుకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ఎక్కడెక్కడి వారో సోషల్ మీడియాలో స్నేహితులుగా మారుతున్నారు. చూస్తుండగానే ఆ స్నేహం కాస్త ప్రేమగా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలో ఎలాగైనా ప్రేమించిన వారిని కలుసుకోవాలనే ఉద్దేశంతో దేశాలు దాటి రావడం ఇటీవల సర్వసధారణం అయిపోయింది. గతంలో ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్, పాకిస్థాన్ కుర్రాడిని కులుసుకునేందుకు భఆరత్ నుంచి వెళ్లిన అంజు స్టోరీని మరువక ముందే తాజాగా ఇలాంటి మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. పాక్ నుంచి ఓ యువతి ఇండియా రాబోతోంది. రెండ్రోజుల క్రితమే ఈమెకు భారత్‌కు చెందిన యువకుడితో ఆన్‌లై‌న్‌లో వివాహం కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని (Rajasthan) జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్‌ అనే యువకుడు కంప్యూటర్ ఇంజనీర్‌గా (Computer Engineer) పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే చివరకు ఏకంగా పాకిస్థాన్ అమ్మాయితో (Pakistani young woman) పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే వీరేమీ సోషల్ మీడియాలో ద్వారా పరిచయం కాలేదు. అర్బాజ్‌ అన్న సియాక్.. కరాచీ నగరానికి చెందిన యువతినే వివాహం (marriage) చేసుకున్నాడు. ఆరకంగా వీరికి అక్కడి వారితో బంధుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో అర్బాజ్‌‌కూ అక్కడి అమ్మాయినే ఫిక్స్ చేశారు. ఇరుకుటుంబాల వారికి నచ్చడంతో మూహూర్థం ఖరారు చేసుకున్నారు. అయితే యువతి భారత్ వచ్చేందుకు వీసా (India Visa) రాకపోవడంలో జాప్యం జరిగింది.

Bride: రైల్లో ఓ కొత్త జంట జర్నీ.. బాత్రూంకు వెళ్లిన వధువు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ వరుడికి డౌట్.. రైలంతా వెతికితే..!

online-marriage.jpg

చివరకు రెండు రోజుల కిందట అనుకున్న ముహూర్థానికే ఆన్‌లైన్ వేదికగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం వివాహం (Online marriage) చేసుకున్నారు. ముస్తాబైన వధూవరులు స్క్రీన్ ముందు కూర్చుని మత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం వారి వారి ప్రాంతాల్లో విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అర్బాజ్‌, సియాక్ తాత మహ్మద్ అఫ్జల్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ కావడంతో చాలా ఏళ్ల నుంచే పాకిస్థాన్‌కు చెందిన వారితో పరిచయాలు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. కాగా, వీసా రాగానే భారత్ వచ్చేందుకు వధువు ఎదురు చూస్తూ ఉంది. మరోవైపు కొత్త కోడలి కోసం అర్బాజ్‌ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Fridge-Milk: ఫ్రిడ్జ్‌లో పాలను ఎక్కడ ఉంచుతున్నారు..? తెలియక అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!

Updated Date - 2023-08-04T18:59:07+05:30 IST