Bride Video: ఈ వధువును చూసి జాలి పడుతున్న నెటిజన్లు.. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? వరుడి నిర్వాకం చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-29T16:15:13+05:30 IST

వివాహ కార్యక్రమాలపై సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతోంది. నెట్టింట ఫేమస్ అయ్యేందుకు.. వధూవరులతో పాటూ స్నేహితులు తదితరులు చేసే వినూత్న ప్రయత్నాలు, విన్యాసాలు వెరసి.. కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తున్నాయి. కొన్నిసార్లు...

Bride Video: ఈ వధువును చూసి జాలి పడుతున్న నెటిజన్లు.. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? వరుడి నిర్వాకం చూస్తే..!

వివాహ కార్యక్రమాలపై సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతోంది. నెట్టింట ఫేమస్ అయ్యేందుకు.. వధూవరులతో పాటూ స్నేహితులు తదితరులు చేసే వినూత్న ప్రయత్నాలు, విన్యాసాలు వెరసి.. కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తున్నాయి. కొన్నిసార్లు వరుడితో పోటీ పడి వధువు చేసే ప్రాంక్‌లు, డాన్స్‌లు అందరినీ ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహ వేదికపై వరుడి నిర్వాకం చూసిన నెటిజన్లు.. వధువుపై జాలి పడుతున్నారు.

సోషల్ మీడియాలో వివాహానికి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. వివాహ వేదికపై దండలు మార్చుకున్న వధూవరులు సోఫాలో కూర్చుని కాసేపు సేద తీరుతారు. అయితే ఈ సమయంలో వధువు అంతా అవాక్కయ్యేలా చేస్తుంది. పైకి లేచి వరుడిని చూస్తూ డాన్సు వేస్తుంది. వరుడి వైపు చేతులు చూపుతూ పదే పదే స్టెప్పులు వేస్తుంది. అయితే వధువు డాన్సుకు (Bride dance) వరుడు ఏమాత్రం స్పందించడు. తల పక్కకు తిప్పుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తాడు. అయినా వధువు తన పాటికి తాను డాన్సు వేస్తూనే ఉంటుంది. మధ్యలో ఓ వ్యక్తి వరుడిపై (groom) కరెన్సీ నోట్లను విసరడం కూడా వీడియోలో చూడొచ్చు.

Viral Video: బాబోయ్.. ఇవేం సైన్ బోర్డులు..? ఇలా కూడా ఉంటాయా..? వీటిని చూసిన డ్రైవర్లు ఎటు వెళ్లాలో మరి..!

అయితే వరుడి ప్రవర్తన చూసి అక్కడ ఉన్న అతిథులు కూడా అవాక్కవుతారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చి వరుడితో మాట్లాడుతుంది. ‘‘ఇలా పట్టీపట్టనట్లు ఉండడం ఏం బాగాలేదు’’.. అని అతడికి నచ్చజెబుతూ పైకి లేపుతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వధువు ఇలా డాన్స్ వేయడం అతడికి నచ్చలేదేమో’’.. అని కొందరు, ‘‘ఇతడు ఆమె కంటే గొప్ప డాన్సర్ అయ్యుండొచ్చు.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు’’... అని మరికొందరు, ‘‘వరుడి ప్రవర్తన ఏం బాగాలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-06-29T16:15:13+05:30 IST