Share News

Hyderabad: మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు యువతి పక్కా స్కెచ్.. గంజాయి కొని ఆమె చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Dec 26 , 2023 | 06:06 PM

వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ప్రియురాలిని ఆమె ప్రియుడు దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ఎలాగైనా ప్రియుడిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో...

Hyderabad: మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు యువతి పక్కా స్కెచ్.. గంజాయి కొని ఆమె చేసిన నిర్వాకం..

వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ప్రియురాలిని ఆమె ప్రియుడు దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ఎలాగైనా ప్రియుడిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గంజాయితో ప్రియుడిపై సినిమా తరహాలో స్కెచ్ వేసింది. చివరకు ఆమె పోలీసులకు ఎలా దొరికిందంటే..

హైదరాబాద్‌లో (Hyderabad) ఈ ఘటన చోటు చేసుకుంది. లా చదువుతున్న రింకీ అనే యువతి, శ్రవణ్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ కొన్నాళ్లు రింకీని శ్రవణ్ దూరం పెడుతూ వస్తున్నాడు. ఈ విషయంలో ఇటీవల ఇద్దరి మధ్య (Quarrels between lovers) గొడవలు జరుగుతున్నాయి. దీంతో రింకీ తన ప్రియుడిపై పగ పెంచుకుంది. అతన్ని ఏదో ఒక కేసులో ఇరికించి తన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

Jio New Year offer: న్యూ ఇయర్ సందర్భంగా జియో అదిరిపోయే ఆఫర్.. ఈ ప్లాన్ బెన్‌ఫిట్స్ ఏంటంటే..

ఇటీవల ఓ రోజు రూ.4వేలు ఖర్చు చేసి గంజాయిని (ganja) కొనుగోలు చేసింది. దాన్ని ప్యాకెట్లలో నింపి శ్రవణ్‌‌కు తెలీకుండా అతడి కారులో పెట్టింది. తర్వాత శ్రవణ్, మరికొంతమంది కలిసి జూబ్లీహిల్స్‌లోని పబ్‌కు వెళ్లారు. వారు పబ్‌లో ఉన్న సమయంలో రింకీ.. పోలీసులకు ఫోన్ చేసింది. శ్రవణ్ గంజాయి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దాడి చేసి శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో వారికి రింకీపై అనుమానం వచ్చింది. చివరకు ఆమెను లోతుగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రింకీతో పాటూ మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసి, వారి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: గోడ మీద పులి.. చుట్టూ విచిత్రంగా చూస్తున్న జనం.. చివరకు ఏమైందంటే..

Updated Date - Dec 26 , 2023 | 06:08 PM