Indian Railway: 6 రూపాయల చిల్లర వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన రైల్వే క్లర్క్.. హైకోర్టు దాకా కేసు నడిచినా దొరకని రిలీఫ్..!

ABN , First Publish Date - 2023-08-16T20:53:31+05:30 IST

ఉద్యోగాలు రాలేదని చాలా మంది నిరుద్యోగులు బాధపడుతుంటే.. మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన వారు కొందరు.. తెలిసి తెలిసి చిల్లర పనులు చేసి చివరకు మళ్లీ రోడ్డున పడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా కొందరు తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి...

Indian Railway: 6 రూపాయల చిల్లర వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన రైల్వే క్లర్క్.. హైకోర్టు దాకా కేసు నడిచినా దొరకని రిలీఫ్..!

ఉద్యోగాలు రాలేదని చాలా మంది నిరుద్యోగులు బాధపడుతుంటే.. మంచి మంచి ఉద్యోగాలు వచ్చిన వారు కొందరు.. తెలిసి తెలిసి చిల్లర పనులు చేసి చివరకు మళ్లీ రోడ్డున పడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా కొందరు తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి అవినీతి ఉద్యోగుల గురించి తరచూ వింటూనే ఉంటాం. తాజాగా, ముంబైలో ఓ విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ రైల్వే క్లర్క్ 6 రూపాయల చిల్లర కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. చివరకు హైకోర్టు వరకూ వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ముంబైలోని (Mumbai) కుర్లా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేష్ వర్మ అనే వ్యక్తి కుర్లా స్టేషన్‌లో 1995లో బుకింగ్ క్లర్క్‌గా (Kurla Railway Station Clerk) ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోనే ఇతడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. టికెట్లు ఇచ్చే క్రమంలో ప్రయాణికులకు చిల్లర తిరిగి ఇవ్వడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు క్రమంగా ఎక్కువవడంతో రైల్వే విజిలెన్స్ అధికారులు (Railway Vigilance Officers) రంగంలోకి దిగారు. 1997లో ఓ కానిస్టేబుల్‌ను ప్రయాణికుడిలా టికెట్ కౌంటర్ వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్... రాజేష్ వర్మకు రూ.500లు ఇచ్చి కుర్ల స్టేషన్ నుంచి అర్రాకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర రూ.214కాగా.. వర్మ కానిస్టేబుల్‌కు రూ.286 ఇవ్వాల్సి ఉండగా.. రూ.280లు మాత్రమే ఇచ్చాడు. రూ.6 తక్కువ ఇవ్వడంతో అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమని నమ్ముతూ అధికారులు వర్మపై చర్యలు తీసుకున్నారు.

Crime: ప్రియుడితో పెళ్లి కోసం ఎంతకు తెగించావమ్మా.. భార్యే కావాలంటూ వెళ్లిపోయాడని వెతుక్కుంటూ అతడికి ఇంటికెళ్లి మరీ..!

పూర్తి విచారణ అనంతరం 2002లో వర్మను రైల్వే అధికారులు విధుల నుంచి తొలగించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ వర్మ.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను (CAT) ఆశ్రయించాడు. అక్కడ అతడికి నిరాశే ఎదురవడంతో చివరకు ఇటీవల బాంబే హైకోర్టును (Bombay High Court) ఆశ్రయించాడు. కోర్టులో విచారణ సందర్భంగా వర్మ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజిలెన్స్ బృందం నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. రైల్వే విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం.. గెజిటెడ్ అధికారిని మాత్రమే తనిఖీలకు పంపాలని, కానీ అధికారులు కానిస్టేబుల్‌ను పంపారన్నారు. అందులోనూ టికెట్ తీసుకున్న తర్వాత.. చిల్లర లేకపోవడంతో కొద్ది సేపు కొద్ది సేపు ఆగమన్నాడని, అయినా కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. ఇరువైపు వాదనలను విన్న బాంబే హైకోర్టు.. వర్మకు ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Mother: శుభ్రం చేద్దామని 26 ఏళ్ల కొడుకు గదిలోకి వెళ్తే ఏదో పాడు వాసన.. ఏంటా అని అనుమానంతో మంచం కింద చూస్తే..!

Updated Date - 2023-08-16T20:53:31+05:30 IST