Mother: శుభ్రం చేద్దామని 26 ఏళ్ల కొడుకు గదిలోకి వెళ్తే ఏదో పాడు వాసన.. ఏంటా అని అనుమానంతో మంచం కింద చూస్తే..!

ABN , First Publish Date - 2023-08-16T17:48:29+05:30 IST

రోజురోజుకూ మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కొందరైతే ఆడా, మగా.. చిన్నా పెద్దా అని కూడా చూడకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి వారు మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఉన్నట్టుండి రాక్షసులుగా మారిపోతుంటారు. చేసిన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు మరిన్ని నేరాలు చేస్తుంటారు. ఇటీవల..

Mother: శుభ్రం చేద్దామని 26 ఏళ్ల కొడుకు గదిలోకి వెళ్తే ఏదో పాడు వాసన.. ఏంటా అని అనుమానంతో మంచం కింద చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

రోజురోజుకూ మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కొందరైతే ఆడా, మగా.. చిన్నా పెద్దా అని కూడా చూడకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి వారు మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఉన్నట్టుండి రాక్షసులుగా మారిపోతుంటారు. చేసిన నేరాలను కప్పి పుచ్చుకునేందుకు మరిన్ని నేరాలు చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా, అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఇల్లు శుభ్రం చేసే క్రమంలో కొడుకు గదిలోకి వెళ్లింది. లోపల నుంచి ఉన్నట్టుండి దుర్వాసన వచ్చింది. మంచం కింద చూడగా ఓ ప్లాస్టిక్ మూట బయటపడింది. దీంతో అనుమానంగానే దాన్ని తెరచి చూడగా.. ఊహించని దృశ్యం కంటపడింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో (America Los Angeles) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 26ఏళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం కొడుకు బయటికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో తల్లి తన కొడుకు గదిని శుభ్రం చేసేందుకు వెళ్లింది. అయితే లోపలికి వెళ్లగానే ఉన్నట్టుండి భరించలేని దుర్వాసన వచ్చింది. ఏంటా అని అనుమానంతోనే గది మొత్తం వెతికింది. అయితే ఎక్కడా ఆమెకు ఎలాంటి ఆధారం లభించలేదు. చివరకు కొడుకు మంచం కింద చూడగా.. ప్లాస్టిక్ మూట (Plastic wrap) కనిపించింది.

Viral: బాబోయ్.. రెస్టారెంట్‌కు వెళ్లాక కూడా కాస్త చూసుకుని తినండయ్యా.. చికెన్ కర్రీ ఆర్డర్ ఇస్తే అందులో ఏమొచ్చిందో చూస్తే..!

ఏంటా అని మూట విప్పి చూడగా.. లోపల 20ఏళ్ల యువతి మృతదేహం (young woman dead body) బయటపడింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు మహిళ కొడుకు కూడా ఇంటికి రాలేదు. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. యువకుడే ఆమెను హత్య చేసి, మంచం కింద దాచాడా, లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral: రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్.. తాగేందుకు వెళ్లి.. అక్కడ ఉన్న బోర్డుపై ఏం రాసి ఉందో చదివి అవాక్కైన కస్టమర్లు..!

Updated Date - 2023-08-16T17:52:41+05:30 IST