Viral News: ఈ మహిళకు వింత కష్టం.. కనీసం బాత్రూంలు కడిగే ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదట.. అసలు కారణమేంటంటే..!

ABN , First Publish Date - 2023-07-06T16:21:57+05:30 IST

కొందరు కొన్ని వ్యసనాలకు అలవాటు పడి, వాటి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోతుంటారు. మరికొందరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ఆశయాలు, అభిరుచులను మాత్రం వదులుకోరు. ఇప్పుడీ..

Viral News: ఈ మహిళకు వింత కష్టం.. కనీసం బాత్రూంలు కడిగే ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదట.. అసలు కారణమేంటంటే..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు కొన్ని వ్యసనాలకు అలవాటు పడి, వాటి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోతుంటారు. మరికొందరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ఆశయాలు, అభిరుచులను మాత్రం వదులుకోరు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళకు వింత కష్టం వచ్చింది. కనీసం బాత్రూంలు కడిగే ఉద్యోగం కూడా ఎవరూ ఇవ్వడం లేదు. ఇంతకీ ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటే..

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని (United Kingdom) వేల్స్‌కు చెందిన మెలిస్సా స్టోన్ అనే 46 ఏళ్ల మహిళకు వింత కష్టం వచ్చింది. తన రూపం చూసి కనీసం బాత్రూంలు కడిగే పని కూడా ఎవరూ ఇవ్వడం లేదు. మెలిస్సాకు చిన్నప్పటి నుంచి టాటూలు (Tattoos) అంటే ఎంతో ఇష్టం. ఇదే ఆమెకు సమస్యగా పరిణమిస్తుందని ఊహించలేకపోయింది. కొన్నేళ్ల నుంచి ఆమె తన ఒంటిపై వివిధ రకాల టాటూలు వేయించుకుంది. ప్రస్తుతం ఆమె శరీరంపై సుమారు 800రకాల టాటూలు ఉన్నాయి. చివరకు మొఖాన్ని కూడా వదలకుండా మొత్తం టాటూలు వేయించుకుంది. దీంతో ఆమె రూపం చూడటానికి భయంకరంగా ఉంది. రాత్రి వేళల్లో మెలిస్సా ను చూసి చిన్నపిల్లలతో పాటూ పెద్దవారు కూడా భయపడుతున్నారు. ఈ కారణంతో ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

Viral Video: నెటిజన్ల ఆగ్రహానికి గురైన యువతి.. స్పైడర్ మ్యాన్ వేషంలో వచ్చాడని.. మెల్లగా దగ్గరికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం..

British-woman-viral-news.jpg

ఇటీవల ఆమె చివరకు టాయిలెట్లు (Toilets) శుభ్రం చేసే పని కోసం దరఖాస్తు చేసుకుంది. అయినా వారు ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. గతంలో ఓ సారి ఉద్యోగం వచ్చినా.. ఎక్కువ కాసం కొనసాగలేకపోయానని సదరు మహిళ చెబుతోంది. తాను 20 సంవత్సరాల వయసు నుంచి టాటూలు వేయించున్నట్లు మెలిస్సా తెలిపింది. వారినికి కనీసం మూడు, నాలుగు పచ్చబొట్టు వేయించుకుంటున్నట్లు చెప్పింది. మొఖంపై వేసిన టాటూల పైనే మళ్లీ మళ్లీ పచ్చబొట్లు వేసుకున్నట్లు పేర్కొంది. టాటూలు వేసుకోవడం తనకు వ్యసనంగా మారిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన అభిరుచిని మాత్రం వదులుకోనని మెలిస్సా చెబుతోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Viral News: ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి.. మొదటి రోజే ఊహించని షాకిచ్చిన యజమాని.. ఆయన తెచ్చింది చూసి..!

Updated Date - 2023-07-06T16:21:57+05:30 IST