Car Stuck in Mud: బురదగుంటలో కారు ఇరుక్కుపోతే.. బయటకు తీసుకురావడం యమా ఈజీ.. ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి చాలు..!

ABN , First Publish Date - 2023-06-23T19:01:32+05:30 IST

తెలివి ఒకరి సొత్తు కాదు అని పెద్దలు అన్నట్లు.. వినూత్నంగా ఆలోచించాలే కానీ ఎంత పెద్ద సమస్యను అయినా ఈజీగా పరిష్కరించవచ్చు. కొందరు చిన్న చిన్న సమస్యలకే తలకిందులవుతుంటారు. మరికొందరు ఎలాంటి సమస్యనైనా చిన్న చిట్కాతో పరిష్కరిస్తూ ఉంటారు. ఇలాంటి ..

Car Stuck in Mud: బురదగుంటలో కారు ఇరుక్కుపోతే.. బయటకు తీసుకురావడం యమా ఈజీ.. ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి చాలు..!

తెలివి ఒకరి సొత్తు కాదు అని పెద్దలు అన్నట్లు.. వినూత్నంగా ఆలోచించాలే కానీ ఎంత పెద్ద సమస్యను అయినా ఈజీగా పరిష్కరించవచ్చు. కొందరు చిన్న చిన్న సమస్యలకే తలకిందులవుతుంటారు. మరికొందరు ఎలాంటి సమస్యనైనా చిన్న చిట్కాతో పరిష్కరిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఓ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బురదగుంటలో ఇరుక్కపోయిన కారును ఓ వ్యక్తి సింపుల్‌గా బయటికి తీసుకొచ్చేశాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతన్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బురద గుంటలో కారు (car stuck in mud) ఇరుక్కుపోవడంతో బయటికి రావడం కష్టంగా మారుతుంది. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి వినూత్నంగా (Innovative idea) ఆలోచించాడు. ఎవరి సాయం అక్కర్లేకుండా, నెట్టే పని లేకుండా సింపుల్ ట్రిక్ ఉపయోగించాడు. వెనుక చక్రానికి ఓ పొడవాటి చెక్కను తాడుతో కట్టేశాడు. ఇంకేముందీ.. కారు వెనక్కు వెళ్లినప్పుడల్లా చెక్క సాయంతో కారు టైరు బురదలో ఇరుక్కోకుండా ఈజీగా వెనక్కు వెళ్తుంది.

Viral Video: 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. అందరి నోటా ఒకే ఒక్క ప్రశ్న..!

టైరుతో పాటూ చెక్క కూడా తిరుగుతూ ఉండడం వల్ల.. ఎలాంటి శ్రమ లేకుండా కారు బయటికి వచ్చేసింది. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అరె! ఇంత ఈజీనా’’.. అని కొందరు, ‘‘వాటెన్ ఐడియా గురూ’’.. అని మరికొందరు, ‘‘నీ తెలివికి హ్యాట్సాప్ గురూ’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-23T19:01:32+05:30 IST