Viral Video: తోడేలును రక్షించేందుకు ప్రాణాలనే ఫణంగా పెట్టాడు.. ఇతడు చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-05-10T17:29:54+05:30 IST

ఎదుటి వారు ప్రమాదంలో ఉంటే.. చాలా మంది మనకెందుకులే అనుకుని పక్కకు వెళ్లిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఇంకొందరు క్రూర మృగలా పట్ల కూడా సానుభూతి చూపిస్తుంటారు. ఇలాంటి..

Viral Video: తోడేలును రక్షించేందుకు ప్రాణాలనే ఫణంగా పెట్టాడు.. ఇతడు చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ఎదుటి వారు ప్రమాదంలో ఉంటే.. చాలా మంది మనకెందుకులే అనుకుని పక్కకు వెళ్లిపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితుల ప్రాణాలను కాపాడుతుంటారు. ఇంకొందరు క్రూర మృగలా పట్ల కూడా సానుభూతి చూపిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ప్రమాదంలో ఉన్న తోడేలును రక్షించేందుకు ఓ వ్యక్తి తన ప్రాణాలనే ఫణంగా పెట్టాడు. ఇతడు చేసిన పని చూసి అంతా.. శభాష్! అంటూ మెచ్చుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (viral videos) అవుతోంది. ఓ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు (Hunters) ఏర్పాటు చేసిన ఉచ్చులో ఓ తోడేలు (trapped wolf) చిక్కుకుంటుంది. కాలికి ఉచ్చు తగులుకోవడంతోఎటూ వెళ్లలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఉచ్చు నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తోడేలును గమనిస్తాడు. ఎలాగైనా దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఓ కర్ర తీసుకుని మెల్లిగా దగ్గరికి వెళ్తాడు. ముందుగా తోడేలను కదలకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తోడేలు తలను కర్రతో పట్టుకోవాలని చూస్తాడు. అప్పటికే తీవ్ర భయంతో ఉన్న తోడేలు.. ముందుగా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

అయినా అతను ఏమాత్రం భయపడకుండా దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. కొంత సేపటి తర్వాత ఎట్టకేలకు తోడేలు తలను కర్రతో పట్టుకుని కదలకుండా చేస్తాడు. తర్వాత చాకచక్యంగా తోడేలి కాలుకు తగులుకుని ఉన్న ఉచ్చును (man saved the wolf) తప్పిస్తాడు. పైకి లేకవగానే తోడేలు ఎక్కడ తనపై దాడి చేస్తుందో అనుకుని, ఎంతో జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తర్వాత పైకి లేచిన తోడేలు అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి మానవత్వాన్ని, ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

Updated Date - 2023-05-10T17:33:04+05:30 IST