Viral: పనస పండ్లు కోసేందుకు చెట్టెక్కాడు.. అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు..

ABN , First Publish Date - 2023-07-19T21:54:18+05:30 IST

కొన్నిసార్లు ఏదో చేద్దామని వెళ్తే.. చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనల్లో కొన్ని కన్నీళ్లు తెప్పిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం..

Viral: పనస పండ్లు కోసేందుకు చెట్టెక్కాడు.. అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు..

కొన్నిసార్లు ఏదో చేద్దామని వెళ్తే.. చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనల్లో కొన్ని కన్నీళ్లు తెప్పిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పనస పండ్లు కోసేందుకు చెట్టెక్కాడు. అయితే మధ్యలో ఉన్నట్లుండి అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకుని ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పనస పండ్లు (jackfruit) కోసేందుకు చెట్టు ఎక్కుతాడు. మంచి మంచి పండ్లను ఏరికోరి మరీ కోసుకుంటూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. కాళ్ల పాదాల మీద ఏదో పాకుతున్నట్లు అనుమానం రావడంతో కిందకు చూసుకుంటాడు. ఇంకేముందీ.. ఓ పెద్ద పాము (snake) అతడి కాళ్లను చుట్టేసి ఉంటుంది. ‘‘ఈ చెట్టు నాది.. నాకు తెలీకుండా పనస పండ్లు కోయడానికి నీకెంత ధైర్యం’’.. అనట్లుగా అతడి కాళ్లను పెనవేసుకుంటుంది. పామును చూడగానే అతడికి ఒక్కసారిగా వణుకు పుడుతుంది. వామ్మో! చచ్చాన్రో అనుకుంటూ.. దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు.

Viral Video: ఈ పిల్లికి మరీ ఇంత అసూయ ఎందుకో.. యజమాని పట్టించుకోలేదని చివరకు ఏం చేసిందో చూడండి..

అయినా పాము మాత్రం కాలిని చుట్టుకునే ఉంటుంది. ‘‘నువ్వు చెట్టు దిగే వరకూ వదిలే ప్రసక్తే లేదు’’.. అన్నట్లుగా అతడి కాలిపై అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. దీంతో పాము ఎక్కడ కాటేస్తుందోననే భయంతో... మెల్ల మెల్లగా దాన్నుంచి దూరంగా జరుగుతాడు. పాము కాటు వేయకపోవడంతో చివరకు హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘పాము ఫర్మిషన్ తీసుకుని చెట్టెక్కాలని తెలీదా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది’’.. అని మరికొందరు, ‘‘పనస చెట్టుకు సెక్యూరిటీ బాగా పెట్టారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman: ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఇంట్లోకి వెళ్లి.. కాసేపటికి బయటికి పరుగందుకున్న యువకులు.. ఆమె చేసిన ఒక్క పనితో..

Updated Date - 2023-07-19T21:54:18+05:30 IST