Viral News: ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ భార్య ఫోన్‌కు మెసేజ్.. అందులో బైకు నడుపుతున్న భర్త ఫొటో చూసి షాక్.. చివరకు పోలీస్ స్టేషన్‪‌కు వెళ్లడంతో..

ABN , First Publish Date - 2023-05-11T17:29:07+05:30 IST

కొందరు ఎదుటి వారికి సాయం చేయబోయి.. చివరకు చిక్కుల్లో పడుతుంటారు. మరికొందరు, ఎవరూ చూడలేదులే అనుకుంటూ తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయితే చివరకు ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో తప్పులు బయటపడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే..

Viral News: ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ భార్య ఫోన్‌కు మెసేజ్.. అందులో బైకు నడుపుతున్న భర్త ఫొటో చూసి షాక్.. చివరకు పోలీస్ స్టేషన్‪‌కు వెళ్లడంతో..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు ఎదుటి వారికి సాయం చేయబోయి.. చివరకు చిక్కుల్లో పడుతుంటారు. మరికొందరు, ఎవరూ చూడలేదులే అనుకుంటూ తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయితే చివరకు ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో తప్పులు బయటపడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ భార్య ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. అయితే అందులో బైకు నడుపుతున్న భర్త ఫొటో చూసి భార్య షాక్ అయింది. చివరకు ఈ సమస్య పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

కేరళలోని (Kerala) ఇడుక్కిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 32ఏళ్ల వ్యక్తి.. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటాడు. ఈ దంపతుల (couple) మధ్య ఎలాంటి సమస్యలూ లేకున్నా.. ఇటీవల ఒక్కసారిగా ఊహించని సమస్య వచ్చి పడింది. వీరి స్కూటీ భార్యపై పేరుపై రిజిస్టర్ అయి ఉంది. అయితే ఇటీవల ఓ రోజు ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ చలాన్ (Traffic challan) కట్టంటూ వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయింది. చివరకు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన ఫొటో చూసి ఖంగుతింది. భర్త హెల్మెట్ లేకుండా బండి నడపడంతో చలాన్ విధించినట్లు తెలిసింది.

Viral Video: పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.. కావాలంటే ఈ కుక్కను చూడండి..

అయితే ఇందులో ఎలాంటి సమస్యా లేకున్నా.. బండిపై భర్త వెనుక కూర్చున్న మహిళను చూసి భార్యకు అనుమానం కలిగింది. ఇంటికి వచ్చిన భర్తను.. ఇదే విషయమై నిలదీసింది. ‘‘ఆమె ఎవరో తెలీదు.. లిఫ్ట్ అడిగితే ఇచ్చా’’.. అని భర్త చెబుతున్నా ఆమె వినిపించుకోలేదు. చివరకు ఈ వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త ఎవరితోనే తిరుగుతున్నాడని, ఫొటో చూపించి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో భర్తపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దంపతులు మధ్య సీసీ కెమెరాలు (CC cameras) చిచ్చు పెట్టాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

Updated Date - 2023-05-11T17:29:07+05:30 IST