Viral Video: పాములా పాకుతున్న యువకుడు.. కానిస్టేబుల్ కాలును కొరికేయాలని చూడగా.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-05-10T20:33:43+05:30 IST

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు మందుబాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడలేని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ కొందరు, వింత వింతగా ప్రవర్తిస్తూ మరికొందరు.. పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి వారిని..

Viral Video: పాములా పాకుతున్న యువకుడు.. కానిస్టేబుల్ కాలును కొరికేయాలని చూడగా.. చివరికి ఏం జరిగిందంటే..

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు మందుబాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడలేని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ కొందరు, వింత వింతగా ప్రవర్తిస్తూ మరికొందరు.. పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్ని సార్లు నవ్వు వస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాములా పాకుతున్న ఓ యువకుడు.. ఉన్నట్టుండి పోలీసు వద్దకు వెళ్తాడు. సడన్‌గా కానిస్టేబుల్ కాలును కొరికేయాలని చూడగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. రాత్రి సమయంలో రోడ్డు పక్కన పోలీసు కారు (police car) ఆగి ఉంటుంది. కారు పక్కనే ఓ కానిస్టేబుల్.. బుల్లెట్ వాహనంపై కూర్చుని ఉంటాడు. కారులోని సిబ్బందితో మాట్లాడుతూ ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఫుల్‌గా మందు కొట్టిన ఓ యువకుడు పాములా పాకుతూ (young man Acting like a snake) అక్కడికి వస్తాడు. మెల్లగా బైకు వద్దకు పాక్కుంటూ వెళ్తాడు. ఆ సమయంలో ఇతన్ని గమనించని కానిస్టేబుల్.. కారులో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూనే ఉంటాడు. కానిస్టేబుల్ వద్దకు వెళ్లిన యువకుడు.. అతడి కాలును కొరికే (young man tried to bite policeman) ప్రయత్నం చేస్తాడు. ఊహించని ఈ ఘటనతో సదరు పోలీసు ఉలిక్కిపడతాడు.

Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

అతన్ని కాలితో తన్ని అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడుతుంది. అయినా యువకుడు పోలీసును వదలడు. పగ ఉన్నట్లుగా మళ్లీ పాకుతూ పోలీసు వద్దకు వెళ్లాలని చూస్తాడు. ‘‘పక్కకు వెళ్లిపో.. పక్కకు వెళ్లిపో’’.. అని పోలీసులు పదే పదే సూచిస్తున్నా అతడు పాకుతూ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. దీంతో భయపడిపోయిన పోలీసు.. పరుగెత్తుకుంటూ కారు వద్దకు వెళ్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘మొత్తానికి పోలీసుకే చుక్కలు చూపించాడు’’.. అని కొందరు, ‘‘స్నేక్ యాక్టింగ్ సూపర్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

Updated Date - 2023-05-10T20:33:43+05:30 IST