Share News

Viral Video: ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది.. కుక్కను పట్టుకుని ఫోన్ చూసుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా..

ABN , First Publish Date - 2023-11-16T19:51:07+05:30 IST

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కొందరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా ఫోన్ ద్వారానే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఇదే ఫోన్ ద్వారా ఎక్కడలేని పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాగే ఇంకొందరు స్మార్ట్ ఫోన్ ధ్యాసలో పడి ప్రమాదాలకూ గురవుతున్నారు. చాలా మంది...

Viral Video: ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది.. కుక్కను పట్టుకుని ఫోన్ చూసుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కొందరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా ఫోన్ ద్వారానే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఇదే ఫోన్ ద్వారా ఎక్కడలేని పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాగే ఇంకొందరు స్మార్ట్ ఫోన్ ధ్యాసలో పడి ప్రమాదాలకూ గురవుతున్నారు. చాలా మంది నిత్యం ఫోన్‌ పిచ్చిలో పడిపోయి చుట్టూ ఏం జరుగుతోందో కూడా తెలీనంత స్థితికి చేరుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కుక్కను పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఫోన్ ధ్యాసలో పడిపోయాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఓ యువకుడు (young man) తన పెంపుడు కుక్కను పట్టుకుని రోడ్డు పైకి వాకింగ్‌కు వచ్చాడు. దారి మధ్యలో అతడి ధ్యాస ఫోన్ పైకి మళ్లింది. ఫోన్‌లో ఏదో చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా కొంత దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి ఎదురుగా ఓ కారు వచ్చింది. కారు డ్రైవర్ కుక్కను (car hit the dog) గమనించకుండా దూసుకెళ్లాడు. కారు కుక్క పైకి ఎక్కగానే యువకుడు షాక్ అవుతాడు. ‘‘అయ్యో..! నా కుక్క’’.. అని అరుస్తూ దాన్ని కారు కింద నుంచి బయటకు లాగే ప్రయత్నం చేస్తాడు.

Viral Video: రైల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డతో కనిపించిన మహిళ.. విషయం ఏంటా అని ఆరా తీయగా.. షాకింగ్ ట్విస్ట్..

ఈ ప్రమాదంలో కుక్క ప్రాణాలతో బయటపడ్డా.. తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పక్కన ఉన్న వారంతా అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీయడం వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే ఉంటుంది’’.., ‘‘అనవసరంగా కుక్కను బలిచేశాడు’’.., ‘‘మరీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదు’’.., ‘‘రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.., ‘‘అతడికి జరిగి ఉంటే బాధ అర్థమయ్యేది’’... ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 54వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Google-Police: దగ్గర్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా..? అని గూగుల్‌లో వెతికితే షాకింగ్ రిజల్ట్..!

Updated Date - 2023-11-16T19:51:14+05:30 IST