Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-02T15:27:41+05:30 IST

కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అయినా ఎంతో మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చాలా మంది వినిపించుకోరు. తీరా..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అయినా ఎంతో మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చాలా మంది వినిపించుకోరు. తీరా జరగాల్సిన నష్టం జరిగాక చింతిస్తూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఓ యువకుడు నిర్లక్ష్యంగా చేసిన చిన్న పని చివరకు అతడి ప్రాణాలనే బలికొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో (Mumbai Malad Railway Station) జూన్ 17న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. స్టేషన్‌లోని 3వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తుంటారు. అక్కడే ఉన్న కొందరు యువకులు బెంచ్‌పై కూర్చుని టిఫిన్ చేస్తుంటారు. టిఫిన్ తిన్న తర్వాత బాత్‌రూంకి వెళ్లి చేతులు శుభ్రపరచుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇద్దరు యువకులు ప్లాట్‌ఫారమ్‌ చివరకు వెళ్లి పట్టాలపై చేతులు కడుక్కుంటారు. ఓ యువకుడు చేతులు కడుక్కుని నీళ్ల బాటిల్‌ని మరో యువకుడికి ఇస్తాడు.

Viral Video: బాలికను కిడ్నాప్ చేయాలని చూసిన దుండగులు.. గమనించిన కుక్క చివరకు ఏం చేసిందో చూడండి..

ఇంకో యువకుడు కూడా పట్టాల పైనే చేతులు కడుక్కోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో హైస్పీడ్ ఏసీ లోకల్ ట్రైన్ వేగంగా వచ్చి యువకుడిని (train hit a young man) ఢీకొట్టి వెళ్లిపోతుంది. దీంతో సదరు యువకుడు ఎగిరి దూరంగా పడిపోతాడు. తలకు బలమైన గాయమవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడి పరుగెత్తుకుంటూ అతడి వద్దకు వెళ్తారు. అప్పటిదాకా బాగున్న వ్యక్తి ఉన్నట్టుండి ఇలా మృత్యువాత పడటాన్ని ప్రయాణికులు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

Updated Date - 2023-07-02T15:27:41+05:30 IST