Share News

World Cup 2023 Closing Ceremony Live: ఫైనల్ పోరుకు సర్వం సిద్దం.. ప్రధాని మోదీ కీలక ట్వీట్

ABN , First Publish Date - 2023-11-19T11:36:29+05:30 IST

ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.

World Cup 2023 Closing Ceremony Live: ఫైనల్ పోరుకు సర్వం సిద్దం.. ప్రధాని మోదీ కీలక ట్వీట్

Live News & Update

  • 2023-11-18T19:50:00+05:30

    అహ్మదాబాద్‌ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న టీమిండియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

    "ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా! 140 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. మీరు మరింత ప్రకాశవంతంగా మెరవాలి. బాగా ఆడండి. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టండి" అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కాగా ఇదివరకు 1983, 2011లలో భారత్ ప్రపంచ కప్ టైటిల్స్ గెలిచింది. 2003లో ఫైనల్‌కు చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో 125 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

  • 2023-11-18T12:41:00+05:30

    నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన ముగింపు వేడుకలు

    Untitled-13.jpg

  • 2023-11-18T12:31:00+05:30

    ఉత్తరప్రదేశ్‌లోని స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్వగ్రామంలో టీమిండియా గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

  • 2023-11-18T12:27:00+05:30

    భారీ భద్రత మధ్య టీమిండియా జట్టు స్టేడియంకు బయలుదేరింది. వీధుల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలుకుతున్నారు.

  • 2023-11-18T12:12:00+05:30

    ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు ముందు.. సచిన్ టెండూల్కర్ ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశాడు. టీమిండియా జెర్సీ కటౌట్ వెనుక నిలబడి కనిపించాడు. భారత జట్టుకు మద్దతుగా సచిన్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. సచిన్‌తో పాటు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా రానున్నాడు.

  • 2023-11-18T12:08:00+05:30

    టీమిండియా జట్టు స్టేడియానికి బయలుదేరింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో సహా మొత్తం జట్టు మరికాసేపట్లో స్టేడియానికి చేరుకుంటుంది. టీమ్‌తో పాటు ప్రేక్షకుల భద్రత కోసం వేలాది మంది పోలీసులను మోహరించారు.

  • 2023-11-18T12:07:00+05:30

    IPL జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. యూపీ, బీహార్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఛత్ పండుగను జరుపుకుంటున్నారు. లక్నో ఛత్ యొక్క వీడియో భాగస్వామ్యం చేయబడింది. "ఇది ఛత్ ... నమ్మండి, ఈ రోజు పండుగ కూడా జరుపుకుంటారు" అని టీమ్ క్యాప్షన్‌లో రాసుకుంది.

  • 2023-11-19T12:02:00+05:30

    అంతా బ్లూమయం

    Untitled-12.jpg

    ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు నరేంద్ర మోదీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఎక్కడ చూసినా జనాల్లో బ్లూ జెర్సీల్లోనూ కనిపిస్తున్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రెండు మూడు రోజుల ముందుగానే అభిమానులు సన్నాహాలు ప్రారంభించారు.

  • 2023-11-18T11:53:00+05:30

    భారత క్రికెట్ జట్టు లెజెండ్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అహ్మదాబాద్ చేరుకున్నారు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు సచిన్ నరేంద్ర మోదీ స్టేడియంకు మరికాసేపట్లో చేరుకోరున్నారు. విమానాశ్రయంలో సచిన్ కనిపించారు. టీమిండియా ఫ్యాన్స్‌తో నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల సందడి నెలకొంది.

    Untitled-11.jpg

  • 2023-11-18T11:52:00+05:30

    భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, నటి దీపికా పదుకొణె అహ్మదాబాద్ చేరుకోనున్నారు. దీపికా, రణవీర్‌ల వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఇందులో అతను టీమిండియా జెర్సీలో కనిపించారు.

  • 2023-11-18T11:45:00+05:30

    నరేంద్ర మోదీ స్టేడియానికి పోటెత్తిన ప్రేక్షకులు

    ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న నరేంద్ర మోదీ స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తారు. మ్యాచ్ ప్రారంభానికి 3 గంటల ముందే స్టేడియానికి తరలివచ్చారు. మరోవైపు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా మైదానికి వస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైదానికి చేరుకున్నాడు.

  • 2023-11-18T11:30:00+05:30

    IND vs AUS World Cup 2023 Final Live Updates: ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది. టీమిండియా కప్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఫైనల్ ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటున్నారు.