Share News

Babu Mohan: తనను ఓడగొట్టేందుకు మంత్రి హరీశ్‌ కుట్ర

ABN , First Publish Date - 2023-11-24T23:18:10+05:30 IST

తనను రాజకీయంగా ఓడగొట్టేందుకు ఇన్ని కుట్రలు చేయాలి అని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పై బీజేపీ జోగిపేట అభ్యర్థి బాబుమోహన్‌ ( Babu Mohan ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Babu Mohan: తనను ఓడగొట్టేందుకు మంత్రి హరీశ్‌ కుట్ర

సంగారెడ్డి జిల్లా: తనను రాజకీయంగా ఓడగొట్టేందుకు ఇన్ని కుట్రలు చేయాలి అని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) పై బీజేపీ జోగిపేట అభ్యర్థి బాబుమోహన్‌ ( Babu Mohan ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు రాయికోడ్ మండలంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లి బాబుమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా బాబుమోహన్‌ మాట్లాడుతూ...‘‘ బీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకులను విడగొట్టిందని కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్, హరీష్ ,కేటీఆర్‌పై బాబుమోహన్ మండిపడ్డారు. మా కుటుంబాన్ని విడదీసి సిద్దిపేటలో నా కొడుకు మెడలో బీఆర్ఎస్ కండువా కప్పుతావా హరీష్. నా కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ ... ఉదయ్ బాబుమోహన్ కాదు. నా పేరును రాజకీయంగా దురుద్దేశంతో వాడుకోవాలని చూస్తే ఖబర్ధర్ హరీశ్‌రావు. నా కొడుకు టికెట్ అడిగితే నేను త్యాగం చేసేవాడిని. నేను పిలిస్తే పలుకుతాను. బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యండి. నేను కబ్జాలు చేయలేదు - ప్రజా సేవ చేశాను. దామోదర్ కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకున్నాడు’’ అని బాబుమోహన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2023-11-24T23:18:13+05:30 IST