Vinod Kumar: తెలంగాణ అభివృద్ధి బండి సంజయ్‌కి కనిపించడం లేదా...?
ABN , First Publish Date - 2023-10-06T21:48:50+05:30 IST
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(BJP MP Bandi Sanjay Kumar)కి కనిపించడం లేదా అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) వ్యాఖ్యానించారు.
కరీంనగర్: తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(BJP MP Bandi Sanjay Kumar)కి కనిపించడం లేదా అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Vinod Kumar) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నీటి పారుదలపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం. బండి సంజయ్, కిషన్‌రెడ్డికి నదీ జలాలపై అవగహన లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 జూలైలో సెక్షన్ 3 కింద నదీ జలాలను విభజించాలని కేంద్రాన్ని కోరాం. ఆ తర్వాత కేంద్రానికి చాలా లేఖలు రాశాము. కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాం. 2020లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో కూడా మెలికలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కేసు విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు.
బండి సంజయ్ అవగహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా హరీష్‌రావు కేంద్రానికి లేఖలు రాశారు. కృష్ణ నదిలో తెలంగాణ వాటా తేలలేదు. బండి సంజయ్ తెలంగాణ గ్రోత్ తెలియక మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల ప్రజలు బతుకుతుంటే బండి సంజయ్‌కి కనిపించడం లేదా’’ అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.