Arani Srinivasulu: బలిజలంటే సీఎం జగన్‌కు గిట్టదు...
ABN , Publish Date - Mar 07 , 2024 | 10:42 AM
Andhrapradesh: బలిజ కులస్తులంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిట్టదని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితమే వదిలినా సస్పెండ్ చేయలేదన్నారు. కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తినని తనపై చిన్నచూపని విమర్శించారు.
తిరుపతి, మార్చి 7: బలిజ కులస్తులంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి (CM Jagan Mohan Reddy) గిట్టదని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (Chittoor MLA Arani Srinivasulu) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితమే వదిలినా సస్పెండ్ చేయలేదన్నారు. కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తినని తనపై చిన్నచూపని విమర్శించారు. వైసీపీకి (YSRCP) బలిజలు అంటే పట్టదని.. బలిజలు వైసీపీకి ఓటు వేయరని సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కోటరీ భావన అని అన్నారు. 6 జిల్లాల్లో 74 స్థానాలు ఉంటే 2019లో బలిజ వర్గానికి రెండు స్థానాలు కేటాయించారన్నారు. 2024 ఎన్నికల్లో ఒక్క స్థానం ఇవ్వలేదని మండిపడ్డారు. బలిజలు అంటే ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. తిరుపతిలో పోటీ చేసే అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఇష్టమని.. పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకే అడుగులు వేస్తానని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Bhuvaneswari: అనంతలో ఏయే ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తారంటే?
APPSC: జగన్ ప్రభుత్వంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...