Anitha: దోషులను వదిలి పెట్టం.. పెద్దిరెడ్డికి మాస్ వార్నింగ్
ABN , Publish Date - Jun 22 , 2024 | 09:03 PM
అంగళ్లతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టిన తప్పుడు కేసులపై పునర్ విచారణ చేయిస్తామని.. దోషులను వదిలి పెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి హోం మంత్రి అనిత ఈరోజు( శనివారం) వచ్చారు.
తిరుపతి: అంగళ్లతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టిన తప్పుడు కేసులపై పునర్ విచారణ చేయిస్తామని.. దోషులను వదిలి పెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి హోం మంత్రి అనిత ఈరోజు( శనివారం) వచ్చారు. ఆమెకు తెలుగు మహిళలు ఘన స్వాగతం పలికారు. అంగళ్లు ఇష్యూలో చంద్రబాబుతో సహా వేలాది మందిపై తప్పుడు కేసులపై అనిత స్పందించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ... తెలుగుదేశం నేతల పైన కార్యకర్తల పైన పెట్టిన తప్పుడు కేసుల్ని తొలగిస్తామని స్పష్టం చేశారు.
రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇప్పటి వరకు పుంగనూరులోకి ఎవ్వరినీ రానీయకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుకున్నారని.. ఇకపై అక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగమే అమలవుతుందని చెప్పారు. తిరుపతిలో దొంగ ఎపిక్ కార్డులపై విచారణ వేగవంతం చేస్తామని అన్నారు. వైసీపీకి తొత్తుల్లా ఇప్పటి వరకు వ్యవహరించిన పోలీసులు, పోలీసు సంఘంలోని నేతలకు ఇప్పటికే హెచ్చరించామని.. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని మందలించారు. రాత్రి ఎనిమిదిపైన గుంపులుగా ఉండకూడదన్నాము తప్ప, జనజీవనం ఉండకూడదనలేదని హోం మంత్రి అనిత తెలిపారు.